అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్ నుంచి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వరుసగా కొన్ని నెలల పాటు వరుసగా మెగా హీరోల సినిమాలు విడుదల కానున్నాయి.

యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ‘విశ్వం’. దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ‘విశ్వం’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఫుల్ యాక్షన్, కామెడీతో నిండిపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. తిరుచిట్రంబలం (తెలుగులో తిరు) చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటున్న నిఖిల్
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా లెవల్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్. ప్రస్తుతం ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌజ్’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్యలో సుధీర్ వర్మ దర్శకత్వంలో సైలెంట్‌గా ఒక సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాను ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్
'దేవర'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం మాత్రమే కాదు... అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. 'దేవర' విజయంతో సంతోషంగా ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని 'వార్ 2' చిత్రీకరణ చేయడానికి ముంబై వెళ్లనున్నారు. అది కాకుండా ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... కొత్త సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మెగా జాతర షురూ... అక్టోబర్ నుంచి జనవరి దాకా
మెగా అభిమానులు గత మూడేళ్ల నుంచి తీరని ఆకలి మీద ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ల నుంచి తెరపైకి సినిమా రాక దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇక ఈ ఆకలినంత తీర్చేలా ఇప్పుడు 2024 ద్వితీయార్థం మొత్తం మెగా జాతర జరగబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget