అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘అన్‌స్టాపబుల్’కు సీఎం చంద్రబాబు, ‘రోలెక్స్’పై సూర్య అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘అన్‌స్టాపబుల్’కు సీఎం చంద్రబాబు నుంచి ‘రోలెక్స్’పై సూర్య అప్‌డేట్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ఫస్ట్ ఎపిసోడ్‌కు అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ‘రోలెక్స్’ సినిమాపై సూర్య క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జాట్’ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ‘ఓజీ’ సినిమాతో పరిచయం కానున్నారని తెలుస్తోంది. విష్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ రేపు (అక్టోబర్ 20వ తేదీ) విడుదల కానుంది.

ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్
తెలుగు ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అతి త్వరలో నాలుగో సీజన్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్‌తో 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలు కానుంది. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరగనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'రోలెక్స్' మూవీపై అదిరిపోయే అప్డేట్...
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో హీరోగా నటించిన కమల్ హాసన్ కంటే క్లైమాక్స్ లో విలన్ గా కనిపించిన సూర్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆయన పోషించిన 'రోలెక్స్' పాత్ర గూస్ బంప్స్ తెప్పించింది. అలాగే సినిమాకు ఇది మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక సూర్య పోషించిన ఈ 'రోలెక్స్' పాత్ర కన్పించింది కాసేపే అయినా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ గా సినిమా క్లైమాక్స్ లో ఆయన పండించిన విలనిజాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే 'రోలెక్స్' పాత్రతో సపరేట్ గా ఒక పూర్తి స్థాయి సినిమాను తీస్తానని ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా? అని సూర్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కంగువ' సినిమా ప్రమోషన్లలో భాగంగా 'రోలెక్స్' సినిమా గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ తో కలిసి టాలీవుడ్ దర్శకుడు ఓ సినిమా చేస్తున్నారు. ఇన్ని రోజులు ‘SDGM’ అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మాణ పనులు కొనసాగించిన ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారు చేశారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి ‘జాట్’ అనే పేరు పెట్టారు. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా టైటిల్ తో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. సన్నీ ఇమేజ్ కు తగినట్లుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పెద్ద ఫ్యాన్ ను చేతిలో పట్టుకుని అగ్రెసివ్ గా చూస్తూ కనిపించాడు. ఈ లుక్ చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు అర్థం అవుతోంది. గోపీచంద్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం ఆయా హీరోల అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా, తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఎప్పటి నుంచో అకిరా ఎంట్రీ వార్తలు విన్పిస్తుండగా, అది కూడా తన తండ్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజి' సినిమాలో అకిరా నందన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ‘ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో మాంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘మెకానిక్ రాకీ’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget