అన్వేషించండి

Surya : 'రోలెక్స్' మూవీపై అదిరిపోయే అప్డేట్... క్రాస్ ఓవర్ అంటూ మెదడుకు పదును పెట్టే హింట్ ఇచ్చిన సూర్య

'రోలెక్స్' మూవీపై హీరో సూర్య తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. క్రాస్ ఓవర్ అంటూ సూర్య ఇచ్చిన మెదడుకు పదును పెట్టే హింట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో హీరోగా నటించిన కమల్ హాసన్ కంటే క్లైమాక్స్ లో విలన్ గా కనిపించిన సూర్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆయన పోషించిన 'రోలెక్స్' పాత్ర గూస్ బంప్స్ తెప్పించింది. అలాగే సినిమాకు ఇది మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక సూర్య పోషించిన ఈ 'రోలెక్స్' పాత్ర కన్పించింది కాసేపే అయినా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ గా సినిమా క్లైమాక్స్ లో ఆయన పండించిన విలనిజాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే 'రోలెక్స్' పాత్రతో సపరేట్ గా ఒక పూర్తి స్థాయి సినిమాను తీస్తానని ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా? అని సూర్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కంగువ' సినిమా ప్రమోషన్లలో భాగంగా 'రోలెక్స్' సినిమా గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

క్రాస్ ఓవర్ పై సూర్య హింట్ 
సూర్య మాట్లాడుతూ గతంలో తను నటించిన ఓ సినిమాకు 'రోలెక్స్' మూవీతో లింక్ ఉంటుందని వెల్లడించారు. "1986లో రిలీజ్ అయిన 'విక్రమ్' సినిమాతో 2002లో రిలీజ్ అయిన 'విక్రమ్'కు ఏ రకంగా లింక్ ఉందో, అదే విధంగా 'రోలెక్స్'కు నేను నటించిన మరో సినిమాకు కనెక్షన్ ఉంటుంది' అంటూ లోకి సినిమాటిక్ యూనివర్స్ లో తన 'రోలెక్స్' క్రాస్ ఓవర్ గురించి సూర్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా 'రోలెక్స్'తో లింక్ ఉండబోతున్న ఆ సినిమా ఏమై ఉంటుంది అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. చాలామంది ఆ సినిమా 'వీడొక్కడే' అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

 

'రోలెక్స్' పట్టాలెక్కేది ఎప్పుడంటే? 
సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'కంగువ'. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య 3 విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, బాబి డియోల్ కీలకపాత్రను పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సూర్య. అందులో భాగంగానే ఆయన 'కంగువ' సినిమా విశేషాలతో పాటు తన కొత్త సినిమా ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. పనిలో పనిగా 'రోలెక్స్' గురించి కూడా మాట్లాడి అభిమానులను ఖుషి చేశారు. మరోవైపు ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ' పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత తాను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ హీరోలు అందరితో కలిసి అదిరిపోయే మూవీ చేయాలనుకుంటున్నాను అంటూ ఆయన అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'రోలెక్స్'పై ఒక స్టాండ్ అలోన్ మూవీని చేయాలనుకుంటున్నాను అంటూ డైరెక్టర్ లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ సూర్య అభిమానులలో పూనకాలు తెప్పించింది.

Read Also : Nikita Porwal: ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటం విజేత నికిత పోర్వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - ఆమె నటించిన సినిమా ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget