Akira Nandan Tollywood Entry : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ వారసుడి ఎంట్రీ ఈ సినిమాతోనే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఏ సినిమా ద్వారా టాలీవుడ్ లో అరంగ్రేటం చేయబోతున్నారో తెలుసుకుందాం.
స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం ఆయా హీరోల అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా, తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఎప్పటి నుంచో అకిరా ఎంట్రీ వార్తలు విన్పిస్తుండగా, అది కూడా తన తండ్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజి' సినిమాలో అకిరా నందన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఓజీలో అకిరా నందన్ గెస్ట్ రోల్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను మేనేజ్ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు టైం కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాతో పాటు 'ఓజి' అనే సినిమా షూటింగ్లను కూడా మళ్లీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే 'హరిహర వీరమల్లు' కంటే ఎక్కువగా 'ఓజి'పైనే మెగా అభిమానుల దృష్టి ఉంది. 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఓజి'. 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా జపాన్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకాగా ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు సుజిత్. కాగా పవన్ కళ్యాణ్ 'ఓజి' చిత్రం నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే అకిరా నందన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించబోతున్నాడు అన్న వార్త.
'ఓజీ'లో అకీరా పాత్ర ఇదేనా ?
పవన్ కళ్యాణ్ తన తనయుడు అకిరా నందన్ ని 'ఓజి' సినిమా ద్వారా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ పవన్ కళ్యాణ్ ది కాదు డైరెక్టర్ సుజిత్ ది అని అంటున్నారు. ఇప్పటికే సుజిత్ పవన్ కళ్యాణ్ ముందు తన ప్లాన్ పెట్టగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పుడు అఖీరా నందన్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా, ఆయన కుమారుడు అకిరా నందన్.. పవన్ కళ్యాణ్ యుక్త వయసు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే మెగా అభిమానులకు ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం "ఓజి" సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అకిరా నందన్ సినిమా ఎంట్రీ 'ఓజీ'తో షురూ కాబోతుందన్నమాట. అయితే ఈ వార్తలపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.