KCR Trailer : ముక్కలన్నీ బావకు, బొక్కలన్నీ మీకు... ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో అదరగొట్టిన రాకేష్
రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ జంటగా నటిస్తున్న 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్) మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న సినిమా 'కేసీఆర్'. కేశవ చంద్ర రమావత్ అనేది ఈ సినిమా పూర్తి పేరు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే రిలీజ్ కావలసి ఉన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి, తాజాగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ 'కేసీఆర్' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి.
ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టోరీ
'కేసీఆర్' సినిమాలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తుండగా, అనన్య కృష్ణన్ హీరోయిన్ గా, సుజాత, లోహిత్ కుమార్, తనికెళ్ల భరణి, ధనరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాకేష్ ఇందులో హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ట్రైలర్ విషయంలోకి వెళ్తే... 3.19 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో మొదలై ఎమోషనల్ రూరల్ స్టోరీగా ఎండ్ అయ్యింది. చూస్తుంటే ఇన్స్పిరేషనల్ స్టోరీగా అనిపిస్తోంది.
తెలంగాణలోని ఓ తండాలో ఉండే బావా మరదళ్ళు, ఆహ్లాదకరంగా ఉండే ఊరు వాతావరణం, ఆ ఊరికో సమస్య రావడం, ఆ ఊరికి సమస్య వచ్చినప్పుడు కేశవ చంద్ర చేసిన పని వంటి అంశాలతో సినిమా ఎమోషనల్ గా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ ద్వారా వెల్లడించారు. కాగా రాకింగ్ రాకేష్ ట్రైలర్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే కేశవ చంద్ర రామావత్ మూవీ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సి.
Also Read: 'రోలెక్స్' మూవీపై అదిరిపోయే అప్డేట్... క్రాస్ ఓవర్ అంటూ మెదడుకు పదును పెట్టే హింట్ ఇచ్చిన సూర్య
స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న రాకింగ్ రాకేష్....
'కేసీఆర్' ట్రైలర్ లాంచ్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన అనసూయ రాకింగ్ రాకేష్ గురించి మాట్లాడిన మాటలకు అతను కంటతడి పెట్టుకున్నాడు. 'నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీడు తమ్ముడు... వీడు అతి వినయంగా ఉంటాడని అంటారు చాలా మంది. కానీ నిజంగానే అతను అలా ఉంటాడు. అందరికీ డబ్బులు ఎక్కువైతే ఇల్లు, స్థలాలు లేదా ఆస్తులు కొంటారు. కానీ రాకేష్ మాత్రం అందరిలా కాకుండా సినిమా తీశాడు. ఒక హీరో సినిమా అని చెప్పకుండా పదహారేళ్ల కుర్రోది కథ అని నాకు చెప్పాడు. తప్పకుండా ఈ సినిమా బలగం కంటే పెద్ద హిట్ అవుతుంది' అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. దీంతో రాకేష్ ఎమోషనల్ అయ్యి, స్టేజ్ పైనే ఏడ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే చాలామంది జబర్దస్త్ కమెడియన్లు నటులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి రాకింగ్ రాకేష్ నటిస్తున్న ఈ 'కేసిఆర్' సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.