Ennenno Janmalabandham November 15th: వెక్కి వెక్కి ఏడుస్తున్న వేద- తాగి రచ్చ చేసిన యష్, సంబరంలో ఖైలాష్
వేదకి యష్ దాచిన నిజం తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద ఖుషిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంట్లో సులోచన వేద కోసం టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఈరోజు వేద గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అని శర్మ అడుగుతాడు. తల్లి మనసు అది టెన్షన్ గా ఉంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను అని చాలా బాధపడుతుంది. ‘నీ ఆరాటం నీ కూతురు గురించి కానీ నా ఆరాటం నీ గురించి, ఇప్పటికే నువ్వు ఇంకా పూర్తిగా కొలుకోలేదు’ అని శర్మ అంటాడు. వేద జాతకం ప్రకారం తనకి కొన్ని సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతాయి, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం వేదకి కూడా తెలుసు. మన బిడ్డ బాగుండాలి, దాని కాపురం బాగుండాలి’ అని సులోచన ఆందోళన చెందుతుంది.
Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?
వేద జరిగిన విషయం గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. పిక్నిక్ కి వెళ్ళిన యష్, ఖుషి ఇంకా రాలేదేంటి అని మాలిని వాళ్ళు కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే వేద ఏడుస్తూ ఖుషిని ఎత్తుకుని వస్తుంది. ఒక్కదానివే వచ్చావ్ యష్ ఎక్కడ అని మాలిని కంగారుగా అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పమని వేదని మాలిని, రత్నం అడుగుతారు. వేద ఏమి మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. మాలిని ఎంత అడిగినా చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పమ్మా అని చాలా బతిమలాడుతుంది. మీ అబ్బాయి నా దగ్గర ఒక నిజం దాచాడు అని చాలా ఏడుస్తుంది.
తను అలా ఏడవడం చూసి మాలిని అల్లాడిపోతుంది. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా ఇలా ఏడుస్తుందని మాలిని బాధపడుతుంది. యష్ వేద దగ్గర దాచిన నిజం ఏంటి అని మాలిని ఆలోచిస్తుంది. కాంచన ఖైలాష్ కి ఫోన్ చేస్తుంది. యష్ ఇంకా ఇంటికి రాలేదు, వేద ఖుషిని తీసుకుని ఏడుస్తూ ఇంటికి వచ్చింది, ఏమైందో అంటే చెప్పడం లేదు ఒకటే ఏడుస్తుందని కాంచన చెప్తుంది. అది విని ఖైలాష్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ అభిమన్యు దగ్గర అగ్గిపుల్ల వేశావ్, అక్కడ వేద దగ్గర చిచ్చు రగిల్చాను అని, ఇది చాలు నిన్ను సర్వనాశనం చెయ్యడానికి అని ఖైలాష్ తన మనసులో కుట్ర బయటపెడతాడు.
Also Read: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప
యష్ తాగి ఇంటి దగ్గరకి వస్తాడు. తాగుతూ వాగుతూ ఉంటే అక్కడి సెక్యూరిటీ ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంటే యష్ తనని తోసేస్తాడు. వేదకి ద్రోహం చేశాను, ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను నా కొడుకు కోసమే ఇదంతా చేశాను అని యష్ చాలా బాధపడుతూ అరుస్తాడు. యష్ గొడవ చేయడం రత్నం, మాలిని చూస్తారు. అటు శర్మ, చిత్ర కూడా చూస్తూ ఉంటారు. యష్ అరుపులు విని వేద బయటకి వస్తుంది.