By: ABP Desam | Updated at : 21 Mar 2023 05:42 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@elonmusk/twitter
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లు వసూళ్లు చేసి వారెవ్వా అనిపించింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను దక్కించుకోవడంలో దుమ్మురేపింది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకుంది. ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకు ముందే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సైతం అందుకుంది.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘నాటు నాటు’ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, రీళ్లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీలో టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో దుమ్మురేపింది. ఈ పాటకు లయబద్దంగా కార్ల లైట్లు వెలిగిస్తూ, ఆర్పేస్తూ ఆకట్టుకున్నారు. నాటు పాటకు సింక్ అయ్యేలా లైట్స్ వేస్తూ అదుర్స్ అనిపించారు. అక్కడున్న వాళ్లంతా పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ లైట్ షో వీడియోను ‘RRR’ టీమ్ ఇన్ స్టాలో షేర్ చేసింది.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍
— RRR Movie (@RRRMovie) March 20, 2023
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
‘నాటు నాటు‘ లైటింగ్ షోపై ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో హోరెత్తడంపై ఆ కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. ‘RRR’ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ మేరకు రెండు లవ్ ఎమోజీలను పెట్టారు.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍
— RRR Movie (@RRRMovie) March 20, 2023
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
మస్క్ ట్వీట్ పై ‘RRR’ టీమ్ సంతోషం
మస్క్ స్పందనపై ‘RRR’ టీమ్ స్పందించింది. ఆయన ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. మీకు మా ప్రేమను చెల్లిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.
We PAID our love to @elonmusk ❤️❤️ https://t.co/pSRc3KT9f0
— RRR Movie (@RRRMovie) March 20, 2023
అటు టెస్లా కంపెనీ సైతం ఈ లైట్ షోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది. దీపావళి పండుగ సృష్టించేందుకు ఒకే సమయంలో లెక్కకు మిక్కిలి వాహనాలతో లైట్ షో షెడ్యూల్ చేశామని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Schedule your light show on multiple vehicles simultaneously to create an epic festival of lights! https://t.co/XyhIXTTC0g
— Tesla (@Tesla) March 20, 2023
Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!
Gufi Paintal Death: శకుని మామా ఇకలేరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించిన గుఫీ పెయింటల్!
కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?
బుల్లితెర ప్రీమియర్‌కు సిద్ధమైన రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ - ఏ చానెల్‌లో అంటే..
Shaitan Web Series: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!
Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్
Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్
Hyderabad News: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్, హెచ్ఆర్డీ కేంద్రం