Naatu Naatu Tesla Light Show: అద్భుతం, న్యూజెర్సీలో కార్ల లైట్లతో ‘నాటు నాటు’ ప్రదర్శన - వైరల్ అవుతోన్న టెస్లా వీడియో, డోన్ట్ మిస్!
టెస్లా లైట్ షోలో ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు‘ సాంగ్ తో హోరెత్తింది. లయబద్దంగా కార్ల లైట్లు వెలిగిస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లు వసూళ్లు చేసి వారెవ్వా అనిపించింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను దక్కించుకోవడంలో దుమ్మురేపింది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకుంది. ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకు ముందే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సైతం అందుకుంది.
కార్ల లైట్ షోలో దుమ్మురేపిన ‘నాటు’ పాట
View this post on Instagram
‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘నాటు నాటు’ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, రీళ్లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీలో టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో దుమ్మురేపింది. ఈ పాటకు లయబద్దంగా కార్ల లైట్లు వెలిగిస్తూ, ఆర్పేస్తూ ఆకట్టుకున్నారు. నాటు పాటకు సింక్ అయ్యేలా లైట్స్ వేస్తూ అదుర్స్ అనిపించారు. కాసేపు ఆ ప్రాంతమంతా ‘RRR’ పాటతో దుమ్ములేచింది. అక్కడున్న వాళ్లంతా పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ లైట్ షో వీడియోను ‘RRR’ టీమ్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తెలుగు పాట విశ్వ వ్యాప్తంగా సందడి చేయడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి పనితనానికి ఈ పాట నిదర్శనం అని కొనియాడుతున్నారు.
View this post on Instagram
‘నాటు నాటు’ పాటకు అమెరికా పోలీసుల స్టెప్పులు
రీసెంట్ గా అమెరికా పోలీసులు ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో స్థిరపడిన కొంత మంది ప్రవాస భారతీయులు హోలీ ఆడుతుండగా, ఇద్దరు పోలీసులు వారితో కలిసి హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. సదరు పోలీసులకు మధ్యలో నిలబడిన భారతీయ వ్యక్తి పోలీసులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ప్రజల కేరింతల నడుమ వారు చక్కటి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.
#California cops are enjoying the the #NaatuNaatu song.🙌🙌🤙🤙 Naatu naatu is everywhere #RamCharan #NTR #RRRMovie #SSRajamouli #RRRForOscars #RRR #GlobalStarRamCharan #NTRGoesGlobal #Oscars #Oscars2023 #letsdance pic.twitter.com/rjRQMrjoTs
— being jagan (@nenavat_jagan) March 11, 2023
అద్భుత కొరియోగ్రఫీకి నిలువెత్తు నిదర్శనం
‘నాటు నాటు’ పాటలో పదాలు చాలా తక్కువ. ఎక్కువ భాగం డ్యాన్స్ తోనే నిండిపోయింది. అద్భుత కొరియోగ్రఫీకి ఈ పాట నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డ్యాన్స్ అంటే కేవలం కాళ్లు, చేతులు కదిలించడం మాత్రమే కాదు, అణువణువు స్టెప్స్ వేస్తుంది అనడానికి ఈ పాట ఉదాహరణ. ఒంటిని మెరుపులా కదిలిస్తూ, ప్రేక్షకుల కంటికి ఇంపుగా కనిపించేలా చేశారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఈ పాటలతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.
Read Also: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంత ఖర్చుపెట్టారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

