Oscars 2023: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంత ఖర్చుపెట్టారా?
ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు కీరవాణి, చంద్రబోస్ కు మాత్రమే ఫ్రీ ఎంట్రీ ఇచ్చారట. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, వారి కుటుంబ సభ్యుల కోసం ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేశారట. ఇందుకోసం భారీగా చెల్లించాటర.
మార్చి 12, 2023 నాడు అమెరికా లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు చిత్రం ‘RRR’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ చంద్రబోస్ బంగారు ఆస్కార్ లను అందుకున్నారు. అయితే, కీరవాణి, చంద్రబోస్ మాత్రమే అవార్డుల వేడుకలో ఉచితంగా పాల్గొనే అవకాశం లభించిందట. మిగతా ‘RRR’ సభ్యులంతా ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేసి వేడుకల్లో పాల్గొన్నారట.
ఒక్కో టికెట్ కు రూ. 20 లక్షలు ఖర్చు
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినందున, సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ మాత్రమే ఆస్కార్ 2023 వేడుకలకు హాజరు కావడానికి ఉచిత పాస్‌లు అందించారట నిర్వాహకులు. దర్శకుడు SS రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో సహా మిగిలిన ‘RRR’ బృందం, వారి కుటుంబం ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చిందట. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆస్కార్ 2023 వేడుకలో పాల్గొనేందుకు ఎంట్రీ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్క టిక్కెట్ ధర $25,000, అంటే దాదాపు ₹20.6 లక్షలు. అకాడమీ అవార్డుల బృందం ప్రకారం, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉచిత పాస్‌కు అర్హులు. మిగిలిన అందరూ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడటానికి టిక్కెట్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.
చివరి వరుసలో సీట్లు కేటాయించడంపై అసహనం
రాజమౌళి, ఇతరులకు ఆస్కార్స్‌కి ఉచిత ప్రవేశం ఇవ్వకపోవడంపై చాలా మంది ఆశ్చర్యపోతుండగా, హాల్‌లో ‘RRR’ టీమ్‌కు చివరి వరుసలో సీట్లు కేటాయించడం పై అకాడమీ అవార్డుల నిర్వాహకులపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత దర్శకుడు SS రాజమౌళి, ఆయన టీమ్ చివరి వరుసలో కూర్చుని కనిపించింది. MM కీరవాణి, చంద్రబోస్ ఇతర ఆస్కార్ నామినీలతో పాటు ముందు కూర్చున్నారు. ఎస్ఎస్ రాజమౌళి వెంట ఆయన భార్య రమ, కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కామినేనితో పాటు, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ ఒరిజినల్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించారు. అంతకు ముందు, ఆస్కార్ స్టేజిపై ‘నాటు నాటు’ ప్రదర్శన విషయంలోనూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటకు ప్రదర్శనలో పాల్గొన్న డ్యాన్లర్లు ఇండియన్స్ కాకపోవడం పట్ల నిరుత్సాహపడ్డారు.
View this post on Instagram
Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు