Eesha Rebba: గోదారోళ్లతో ఈషా రెబ్బా స్పెషల్ సాంగ్ - మామూలుగా ఉండదు మరి!
Gangs Of Godavari Special Song: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
Eesha Rebba Special Song: హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయడం కొత్త కాదు. ఆల్రెడీ చాలా మంది చేశారు. అయితే... ఈషా రెబ్బా ఇప్పటి వరకు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. ఆవిడ కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో తళుక్కుమని మెరిశారు. 'అరవింద సమేత వీర రాఘవ'లో ఆమెది రెండో హీరోయిన్ పాత్ర. 'పెనిమిటి...' పాటలో కనిపించారు. అది స్పెషల్ సాంగ్ కాదు. ఇప్పుడు ఓ సాంగ్ చేస్తున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే...
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఈషా రెబ్బా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అందులో నేహా శెట్టి హీరోయిన్. తెలుగమ్మాయి అంజలి మరో నాయిక. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కూడా ఉందట. దాని కోసం ఈషా రెబ్బాను దర్శక, నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. ఆమె వెంటనే ఓకే చెప్పారని తెలిసింది.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార మాతృసంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ'లో ఈషా రెబ్బా నటించారు. ఇప్పుడు మరోసారి ఆ సంస్థలో పని చేసే అవకాశం వచ్చింది.
Also Read: ఎన్టీఆర్ సినిమా ఇంకా లేట్ - దేవర వాయిదాకు కారణాలు ఇవే!
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
యువన్ శంకర్ రాజా స్పెషల్ సాంగ్స్ మామూలుగా ఉండవు!
గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రూపొందుతోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ప్రత్యేక గీతాలకు సంథింగ్ స్పెషల్ బాణీలు ఇవ్వడం ఆయన స్టైల్. పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమాలో 'వెయ్ రా చెయ్ వెయ్ రా'కి గానీ, వెంకటేష్ 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలో 'ఓ బేబీ ఓ బేబీ'కి గానీ మెలోడీ ట్యూన్స్ ఇచ్చారు. మరి, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ఆయన ఎటువంటి ట్యూన్ ఇస్తారో చూడాలి.
Also Read: నిర్మాత ఎస్కేఎన్ ఇంటికి అల్లు అర్జున్... తండ్రి మరణించిన బాధలో ఉన్న ఆత్మీయుడికి ధైర్యం చెప్పిన బన్నీ
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను మొదటి డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా, 'సలార్' డిసెంబర్ 22కి రావడంతో ఆ వారంలో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్న నాని 'హాయ్ నాన్న', నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' సినిమాలు ముందుకు వచ్చాయి. దాంతో విడుదల వాయిదా పడింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ఏమిటంటే... మార్చి 8. ఆ రోజు సినిమా విడుదల కానుంది.
Also Read: కొత్త కారు కొన్న తమిళ హీరో దళపతి విజయ్ - బాబోయ్ అంత రేటా?