News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mega 157 Movie: చిరు సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండదట, అసలు విషయం చెప్పిన దర్శకుడు వశిష్ట!

'బింబిసార' డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన 'భోళాశంకర్' బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  చక్కటి కంటెంట్ ఉన్న కథలకు ఇంపార్టెన్సీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'బింబిసార' దర్శకుడు వశిష్టతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.  UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.   

ఈ మూవీలో మహిళా ప్రధాన పాత్ర ఉండదట!

తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రకు సంబంధించి దర్శకుడు వశిష్ట కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో చిరు క్యారెక్టర్, హీరోయిన్ రోల్స్ గురించి చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో చిరంజీవి గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఆయన పాత్ర అత్యంత మెచ్యూర్డ్ గా ఉంటుందన్నారు.  ఈ మూవీలో మహిళా ప్రధాన పాత్ర ఉండదని చెప్పారు. మెగాస్టార్ ను  ఈ తరం ప్రేక్షకులకు మరింత చేరువ చేసే విధంగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇక ఈ సినిమా భారీ స్థాయిలోరూపొందుతుందని వశిష్ట స్పష్టం చేశారు.

సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి మూవీ

మూడు లోకాలకు, పంచభూతాలకు సంబంధించిన సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మొదటి సినిమా 'బింబిసార' తోనే పీరియాడిక్ డ్రామాను సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఈసారి మెగాస్టార్ తో కలిసి బాక్సాఫీస్ దగ్గర ధూంధాం చేయాలని భావిస్తున్నారట.  అటు ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు ఐశ్వర్యారాయ్ కీలక పాత్రలు పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో మహిళా ప్రధాన పాత్ర ఉండదని దర్శకుడు చెప్పడంతో ఇంతకీ వాళ్లు ఈ సినిమాలో నటిస్తారా? లేదా? అనేది సస్పెన్స్ గా ఉంది. హీరోయిన్ల విషయంలో త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివరలో షూటింగ్ షురూ

ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి చిత్రానికి కీరవాణి సంగీతం అందించబోతున్నారు. 1994లో వచ్చిన 'ఎస్పీ పరశురాం' తర్వాత ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఈ చిత్రంతోపాటు ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించబోతున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Read Also: ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Sep 2023 12:03 PM (IST) Tags: chiranjeevi new movie Director Vassishta Mega 157 Movie Director Vassishta interesting comments

ఇవి కూడా చూడండి

Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!

Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!

Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్‌ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్‌ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

టాప్ స్టోరీస్

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి