Jabardasth Avinash : ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్
‘జబర్దస్త్‘ కమెడియన్ అవినాష్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన మూవీకి సంబంధించిన టైటిట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
![Jabardasth Avinash : ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్ Jabardasth Mukku Avinash as Pre Wedding Prasad, His first look title poster released latest Telugu news Jabardasth Avinash : ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/24db364da3d0414f5345068bd15e82bf1695448960414544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పరిచయం అయిన పలువురు కమెడియన్లు ప్రస్తుతం వెండితెరపై రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఇప్పటికే హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర లాంటి వారు సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో ‘జబర్దస్త్‘ కమెడియన్ చేశారు. ముక్కు అవినాష్ హీరోగా వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
డెక్కన్ డ్రీమ్స్ వర్క్ బ్యానర్ పై నభిషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ త్రీ గా ముక్కు అవినాష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అవినాష్ తొలి చిత్రానికి ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో కొన్ని సినిమాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి, ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయి కుమార్, సంగీత, రియాజ్, రూప ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో అవినాష్ పాతకాలం హీరో మాదిరి డ్రెస్సింగ్ తో కోపంగా చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు నెటిజన్లు అవినాష్ కు అభినందనలు చెప్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
View this post on Instagram
రీసెంట్ హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంబం అయ్యింది. హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలు పెట్టారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టారు. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకోవాలని వారు ఆకాంక్షించారు. అవినాష్ కు మరిన్ని అవకాశాలు రావాలన్నారు.
అందరినీ ఆకట్టుకునే కామెడీ చిత్రం- అవినాష్
సినిమా షూటింగ్ సందర్భంగా మాట్లాడిన అవినాష్, నిర్మాత అభిషేక్ కు ధన్యవాదాలు చెప్పాడు. తనను నమ్మి సినిమా చేస్తున్నందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శకుడు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. త్వరలోనే థియేటర్లతో కలుద్దామని చెప్పారు. ‘జబర్దస్త్‘ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ముక్కు అవినాష్, చక్కటి కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. తక్కువ కాలంలోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ‘బిగ్ బాస్‘ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ‘జబర్దస్త్‘ నుంచి బయటకు వచ్చినా, పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
Read Also: సెట్ ప్రాపర్టీతో ఛలో న్యూజిలాండ్- ‘భక్త కన్నప్ప’ ఆర్టిస్ట్రీ మేకింగ్ అదుర్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)