Keeravani-Rajamouli: కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా - కీరవాణికి ‘పద్మశ్రీ’పై రాజమౌళి స్పందన
ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని వరుస పెట్టి అవార్డులు వరిస్తున్నాయి. పెద్దన్నకి పద్మశ్రీ అవార్డు రావడంపై రాజమౌళి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
![Keeravani-Rajamouli: కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా - కీరవాణికి ‘పద్మశ్రీ’పై రాజమౌళి స్పందన Director SS Rajamouli Special Wishes To Her Brother Keeravani Padma Sree Award Winner Keeravani-Rajamouli: కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా - కీరవాణికి ‘పద్మశ్రీ’పై రాజమౌళి స్పందన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/8432911049e2acb9a52b533c9e57f6e11674707669642521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు పాట గొప్పదనాన్ని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన కీర్తి కిరీటంలో మరొక మణిహారం వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ కీరవాణిని వరించింది. వరుస పెట్టి అవార్డులు రావడంతో కీరవాణి, ఆయన కుటుంబం సంతోషంలో మునిగితేలుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అధ్బుతంగా అభినందించారు. తన మీద ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చూపించారు. పెద్దన్న కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటో పోస్ట్ చేస్తూ తన మీద ఉన్న గౌరవాన్ని చూపించారు.
“ఎంతో మంది అభిమానులు భావించినట్టు ఈ గుర్తింపు చాలా ఏళ్ల తర్వాత దక్కింది. మీరు చెప్పినట్టుగా ఒకరి ప్రయత్నాలకి ఫలితం వచ్చే మార్గం ఒకటుంటుంది. ఇప్పుడు నేను అదే చెబుతున్నా. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకొకటి ఇవ్వు” అని ప్రేమగా నవ్వుతున్న ఏమోజీ పెట్టారు. “మా పెద్దన్న ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు గ్రహీత” అని గర్వంగా ఉందని రాసుకొచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ పాటకి సంగీతం అందించిన కీరవాణి ఆ ఆవార్డుని అందుకున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే పేరు మారుమోగిపోతుంది. అదే ‘RRR’. ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ రేసులో నాటు నాటు పాటకి నామినేషన్ దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సొంతం చేసుకోవడానికి ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నారు. 'బాహుబలి'తోనే ప్రపంచ వ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేసిన కీరవాణి ఆ సినిమాకు శాటర్న్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు 'RRR'తో గోల్డెన్ గ్లోబ్ దగ్గర మొదలు పెట్టి ఆస్కార్ నామినేషన్స్ వరకూ వచ్చేశారు. ఇంకొక్క అడుగు మార్చిలో జరిగే ఈవెంట్ లో ఆస్కార్ కూడా అందుకుంటే ఆ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా RRR, రెహమాన్ తర్వాత ఆ రికార్డును అందుకున్న రెండో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి చరిత్ర సృష్టిస్తారు.
మార్చి 23, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కీరవాణి పేరు వేదికపై వినపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 'నాటు నాటు' పాట సృష్టికర్త కీరవాణి. తన తమ్ముడు ఎస్.ఎస్. రాజమౌళి మాస్టర్ మైండ్ కు తగ్గట్లుగా బాణీలు, బీజీఎం సృష్టించటం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు అతనికే ఆస్కార్ నామినేషన్ బహుమతిగా ఇచ్చే స్థాయికి పెద్దన్న కీరవాణి ఎదిగిపోయారు.
Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)