News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ

విక్టరీ వెంకటేష్ 'అసురన్' రిమేక్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా ప్రకటించారు. ద్వారకా క్రియేషన్స్ పై రాబోతున్న ఈ సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ ను జూన్ 2న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

Srikanth Addala : సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎట్టకేలకు తన కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమా చేస్తున్నాడు. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను జూన్ 2న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దాంతో పాటు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ కూడై విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని చూడవచ్చు. అత్యంత ఆసక్తికరమైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలనూ వైరల్ గా మారింది. దీంతో మరో 3 రోజుల్లో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి. 

ఇదిలా ఉండగా ద్వారకా క్రియేషన్స్ తమ చివరి సినిమా 'అఖండ'తో సంచలన బ్లాక్‌బస్టర్‌ని అందించింది. దీంతో వీరి తదుపరి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  హీరో, హీరోయిన్లు, తదితర నటీనటుల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ సినిమాతో మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు హీరోగా పరిచయం కానున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ మూవీ 1980 బ్యాక్ డ్రాప్ లో రానున్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సమయంలో కోనసీమలో రాజకీయాలు, వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కాస్త రా కంటెంట్‌తోనే శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల హైప్‌కు తగ్గట్టుగానే కొత్త తరం సినిమాతో రాబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సుమారు పదిహేనేళ్ల క్రితం రిలీజైన‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్‌ అడ్డాల... తొలి సినిమానే ఆయనకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా మహేష్‌, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసీ మల్టీస్టారర్‌ ను తెరకెక్కించాడు. ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా కేవలం కుటుంబ నేపథ్యంతో సినిమా తీసి కోట్లు కొల్లగొట్టారు శ్రీకాంత్‌ అడ్డాల. ఆ తర్వాత మెగా ప్రిన్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తూ ‘ముకుందా’ తీశాడు. కమర్షియల్‌గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. విమర్శకుల మెప్పు మాత్రం పొందింది. అలా రెండేళ్లు గడిచాక మహేశ్ తో ‘బ్రహ్మోత్సవం’ తీసి, అట్టర్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దాని తర్వాత వెంకటేష్ తో ‘అసురన్‌’ రీమేక్‌ చేశాడు. అదే తెలుగులో  ‘నారప్ప’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి సినిమానూ ప్రకటించిన శ్రీకాంత్ అడ్డాల.. తాజాగా మూవీని ప్రకటించడం గమనార్హం.

Read Also : Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Published at : 30 May 2023 05:08 PM (IST) Tags: First look Miryala Ravinder Reddy Director Srikanth Addala Title Dwarka Creations

ఇవి కూడా చూడండి

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Jagadhatri December 8th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: ఇరకాటంలో పడ్డ కేదార్, ధాత్రి - రూమ్‌లో ఉన్న యువరాజ్ ధాత్రికి చిక్కుతాడా?

Jagadhatri December 8th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: ఇరకాటంలో పడ్డ కేదార్, ధాత్రి - రూమ్‌లో ఉన్న యువరాజ్ ధాత్రికి చిక్కుతాడా?

Bhupinder Singh: వ్యక్తిని గన్‌తో కాల్చి చంపిన సీరియల్ నటుడు - చిన్న కారణానికే దారుణం

Bhupinder Singh: వ్యక్తిని గన్‌తో కాల్చి చంపిన సీరియల్ నటుడు - చిన్న కారణానికే దారుణం

టాప్ స్టోరీస్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా