News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

రుహనీ శర్మ పోలీస్ పాత్రలో నటించిన సినిమా 'హర్'. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.

FOLLOW US: 
Share:

రుహానీ శర్మ (Ruhani Sharma) గుర్తు ఉన్నారు కదా! సుశాంత్ 'చిలసౌ'తో  తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించారు. హిట్ అందుకున్నారు. ఇంకా 'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లోనూ, ఓటీటీలో విడుదలైన 'మీట్ క్యూట్' యాంథాలజీలోనూ నటించారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్'లోనూ నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... రుహనీ శర్మ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. 

ఖాకీ చొక్కా వేసిన రుహనీ శర్మ 
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన మహిళా ప్రాధాన్య సినిమా 'హర్' (HER Telugu Movie). తెలుగులో చెప్పాలంటే... 'ఆమె'. రుహనీ శర్మ మహిళా ప్రాధాన్య సినిమా చేయడం తొలిసారి అంటే... పోలీస్ పాత్ర చేయడం కూడా తొలిసారే. 'హిట్' సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తే... అతనికి జోడీగా, ఫోరెన్సిక్ అధికారి పాత్రలో ఆమె కనిపించారు. ఇప్పుడు ఏకంగా పోలీస్ రోల్ చేశారు. 

HER... ఓ సస్పెన్స్ థ్రిల్లర్!
శ్రీధర్ స్వరగావ్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందితోంది. డబుల్ అప్ మీడియాస్ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమిది. రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మాతలు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 
సరిగమ చేతికి 'హర్' ఆడియో!  

సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఒక్కో పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Also Read : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు...

ఆరు నెలల సస్పెన్షన్ తర్వాత తొలి కేస్!
ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ నగరంలో జరిగిన క్రైమ్ గురించి చేసే ఇన్వెస్టిగేషన్ సినిమా ముఖ్య కథాంశం అని అర్థం అవుతోంది. ఆరు నెలల సస్పెన్షన్ తర్వాత అర్చన (రుహనీ శర్మ)కు ఓ కేసు వస్తుంది. పోలీస్ శాఖలో ఆమెది ఆరేళ్ళ అనుభవం.  పై అధికారుల ఇగోలు, రాజకీయాలు గట్రా ఆమెకు పట్టవు. పోలీస్ డ్యూటీ మీదే ధ్యాస అంతా! ఓ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో బ్యాకప్ లేకుండా ముందడుగు వేయడం వల్ల ఇద్దరు పోలీసులు ఆస్పత్రి పాలు అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   

''ఇప్పుడు మేల్, ఫిమేల్ ఫిలిమ్స్ అని తేడా లేదు. ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కోవలో మా సినిమా కూడా చేరుతుంది. ఇందులో రుహని పోలీస్ అయినప్పటికీ... ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అయినా... అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ తరహా సినిమా రాలేదు. సినిమాలో రుహాని చాలా కొత్తగా కనిపిస్తారు'' అని దర్శకుడు శ్రీధర్ చెప్పారు. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Published at : 30 May 2023 03:15 PM (IST) Tags: Ruhani Sharma Vikas Vasishta HER Movie Update Saregama Audio Ruhani Sharma Upcoming Movies

ఇవి కూడా చూడండి

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!