News
News
X

RGV on AR Rehman: ఎ.ఆర్.రెహమాన్ చేసిన పనికి కొట్టాలనిపించింది: రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్య్వూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను తీసిన ‘రంగీల’ సినిమా గురించి మాట్లాడుతూ .. ఆ సినిమా సమయంలో ఏ ఆర్ రెహమాన్ తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారాయన.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఆయన గురించి తెలియని వారుండరు. ఇండస్ట్రీలో వర్మ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాల పరంగా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించారు ఆర్జీవి. అందుకే ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 'శివ, రంగీల, గాయం, గోవింద గోవిందా, సత్య వంటి విభిన్న సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికీ ఆయన అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది వర్మ శిష్యులు స్టార్ డైరెక్టర్లుగా పేరుతెచ్చుకున్నారు. అయితే ఇటీవల వర్మ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. ఓ సినిమా కోసం ఏ ఆర్ రెహమాన్ తో పని చేసినపుడు వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించారు ఆర్జీవి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

గతంలో ఆయన బాలీవుడ్ లో దర్శకత్వం వహించిన ‘రంగీల’ సినిమా గురించి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు వర్మ. ఆ సినిమాకు అసలు పాటలే హైలెట్ అన్నారు. తాను పెద్దగా సంగీతం గురించి ఆలోచించనని, అయితే ఆ సినిమా కోసం మ్యూజిక్ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్నానని అన్నారు. అప్పట్లో మణిరత్నం దర్వకత్వంలో వచ్చిన ‘రోజా’ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు పనిచేసిన ఏ ఆర్ రెహమాన్ ను తన ‘రంగీల’ సినిమాకు పెట్టుకున్నానని చెప్పారు. తర్వాత సాంగ్ కంపోజ్ చేయడం కోసం ఏ ఆర్ రెహమాన్ ను గోవా తీసుకెళ్లానని, ఐదు రోజుల సమయం ఇచ్చి ట్యూన్ కంపోజ్ చేయమని చెప్పానని అన్నారు. అయితే రెహమాన్ ఐదు రోజులు అయినా ట్యూన్ కంప్లీట్ చేయలేదని అన్నారు. తాను తర్వాత ట్యూన్ చేసి చెన్నై నుంచి పంపుతానని చెప్పి గోవా నుంచి వెళ్లిపోదాం అని అన్నాడని చెప్పారు. ఎందుకు ట్యూన్ చేయలేదు అని రెహమాన్ ను అడిగితే రూమ్ లో టీవీ చూస్తూ ఉండిపోయా అంటూ సమాధానమిచ్చాడని అన్నారు వర్మ. రెహమాన్ సమాధానంతో తనకు పిచ్చ కోపం వచ్చిందని, లేచి నాలుగు తగిలిద్దాం అనుకున్నాను అని చెప్పుకొచ్చారు వర్మ. 

ఇచ్చిన మాట ప్రకారమే రెహమాన్ చెన్నై వెళ్లాక ట్యూన్ చేసి పంపిచాడని, అది విన్నాక రెహమాన్ కు కాల్ చేసి ఎవరికో పంపాల్సింది నాకు పంపావా అని అడిగానని అన్నారు. తాను చెప్పిన సందర్బానికి ఈ ట్యూన్ సెట్ కాదని చెప్తే.. ఆర్కెస్ట్రా తో చేసినపుడు చూడు చాలా బాగుంటందని బదులిచ్చారట రెహమాన్. అదే ‘హై రామ’ సాంగ్ అని చెప్పారు. ఈ సాంగ్ కు హరిహరన్, స్వర్ణలత వాయిస్ బాగా సెట్ అయిందని అన్నారు. అలా చాలా సాంగ్ లకు రెహమాన్ తో కలసి చేశానని, సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ అప్పట్లో సాంగ్స్ చేసేవాళ్లమని అన్నారు. ‘రంగీల’ సినిమాలో సాంగ్స్ కూడా అలా వచ్చి మంచి హిట్ అయ్యాయని చెప్పుకొచ్చారు వర్మ. 

Published at : 23 Feb 2023 06:54 PM (IST) Tags: Ram Gopal Varma RGV RGV Movies Ar Rehman Rangeela

సంబంధిత కథనాలు

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?