By: ABP Desam | Updated at : 17 Aug 2022 09:16 PM (IST)
Image Credit: Etv/ Mallemalatv
యాంకర్ అనసూయ ఎప్పుడైతే బుల్లితెర రాజ్యంలోకి అడుగుపెట్టారో.. అప్పటి నుంచే కుర్రాళ్లో నిద్రలేమి సమస్యలు మొదలైంది. తన అందంతో మెస్మరైజ్ చేసే అనసూయ.. పాపం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమెకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలోపెట్టుకుని వెండితెర సైతం అనసూయకు ఆహ్వానం పలికింది. ఇప్పటివరకే చేసినవి చిన్న పాత్రలే. కానీ, గుర్తుండిపోయే పాత్రలతో అనసూయ మెప్పిస్తున్నారు. తాజాగా అనసూయ ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో నటించారు. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షకులు.
తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్ షో’లో అనసూయ, రాఘవేంద్రరావు సందడి చేశారు. ఇందులో వారు చేసిన సందడి నవ్వుల జల్లు కురిపించింది. ఇటీవలే ఈ షో ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. వారితోపాటు విష్ణుప్రియ, యశ్వంత్ మాస్టర్, నిత్య శెట్టి కూడా ఈ షోకు హజరయ్యారు. అయితే, అనసూయ, రాఘవేంద్రరావు ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చారు. అనసూయ, రాఘవేంద్రరావు చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ స్టేజి మీదకు వచ్చారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు రాఘవేంద్ర రావు కాసేపు ఫ్యాష్ బ్యాక్‌కు వెళ్లారు. తన లవ్ స్టోరీని చెప్పారు. తన కాలేజీ రోజుల్లో జరిగిన విషయాన్ని చెప్పారు. అప్పట్లో తనతో పాటు అనసూయ అనే అమ్మాయి ఉండేదన్నారు. కనీసం తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామనే అనసూయతో చేతిలో చేయివేసుకుని వచ్చినట్లు చెప్పారు. ఇదే సమయంలో యాంకర్ సుమా ఓ పంచ్ విసిరారు. అప్పట్లో సుమ పేరుతో ఎవరు లేరు కదా? అని అడిగారు. దానికి రాఘవేంద్రరావు వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘‘నీ పెళ్లి చేసింది నేనే కదా’’ అన్నారు. అవును సర్.. ‘‘ఆ పాపం మాత్రం మీదే’’ అని సుమ అనగానే అంతా నవ్వేశారు. ఈసారి షోలో కనీసం రూ.10 కోట్లు అయినా గెల్చుకుని వెళ్లాలి అన్నారు రాఘవేంద్రరావు. అప్పుడు సుమ స్పందిస్తూ.. ‘‘10 కోట్లకైతే అనసూయను తీసుకెళ్లు. 100 కోట్లకైతే నన్ను తీసుకెళ్లు’’ అని అన్నారు. దీంతో ఆయన ‘‘అలా అయితే నువ్వే కావాలి’’ అన్నారు. దీంతో సుమ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత అనసూయ, సుమ కలిసి ఓ పాటకు స్టెప్పులు వేశారు. ‘‘నవ మన్మథుడా.. అతి సుందరుడా’’ అనే పాటతో అదరగొట్టారు. అమ్మాయిగా సుమ.. అబ్బాయిగా అనసూయ చేశారు. ఎవరే అబ్బాయి అంటే.. నన్ను చూపించండి అని రాఘవేంద్రరావు చెప్పడంతో షో అంతా నవ్వుల మయంగా మారింది.
అటు విష్ణు ప్రియకు రెండు యాపిల్ పండ్లు ఇచ్చారు. దీంతో ఆమె స్పందిస్తూ.. నాకు రెండు పండ్లు ఇచ్చారు.. నాకు పెళ్లై ఈ పండ్లతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నట్లు అని తెలిపింది. ఆ మాటతో సుమ ఆమెకు మరో రెండు పండ్లు ఇచ్చి.. ఈ పండు నువ్వు.. ఇంకో పండు మీ ఆయన.. ఈ పండు మీకు పుట్టబోయే పాపో.. బాబో అని చెప్పింది. థ్యాంక్యూ అంటూ విష్ణు ప్రియ నవ్వుల్లో మునిగిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు విష్ణు ప్రియ మీదకు ఫ్లవర్ బొకేస్ విసిరారు. వాటిని క్యాచ్ పట్టుకున్న విష్ణు ప్రియా.. ‘‘నాకు రెండు పెళ్లిల్లు’’ అని అరిచింది. ఆ తర్వాత కాదు కాదు ఒక పెళ్లే అని సరిచేసే ప్రయత్నం చేసింది.
Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం