Radheshyam: నార్త్ లో స్పెషల్ ఫోకస్, 'రాధేశ్యామ్' కోసం డిఫరెంట్ ప్రమోషన్స్
ఒక్కో థియేటర్ దగ్గర ఒక్కో జ్యోతిష్యుడ్ని నియమించి.. అక్కడకు వచ్చే ప్రేక్షకులకు జాతకం చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నారట 'రాధేశ్యామ్' టీమ్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రబృందం. ఇప్పటికే టీమ్ మొత్తం ముంబై, చెన్నైలలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ జరగబోతుంది. రిలీజ్ తరువాత కూడా ఈ ప్రమోషన్స్ ఇదే రేంజ్ లో చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్ పై 'రాధేశ్యామ్' టీమ్ దృష్టి పెట్టింది. హిందీలో భారీ థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే థియేటర్ల దగ్గర కూడా 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారు. 'రాధేశ్యామ్' కథ మొత్తం జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుంది. విధికి, ప్రేమకి మధ్య నడిచే కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించారు. ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు.
దానికి తగ్గట్లుగా ఇప్పుడు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో థియేటర్ దగ్గర ఒక్కో జ్యోతిష్యుడ్ని నియమించి.. అక్కడకు వచ్చే ప్రేక్షకులకు జాతకం చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నారట. దానికోసం దాదాపు 200 మంది జ్యోతిష్యుల్ని ముంబై పంపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్లకు సంబంధించిన ఖర్చులన్నీ నిర్మాతలే భరించబోతున్నారు. మరి తెలుగులో కూడా పబ్లిసిటీ విషయంలో ఇలాంటి ప్లాన్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి!
పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram