By: ABP Desam | Updated at : 14 Mar 2022 12:42 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
సమంత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఆమెపై నెటిజన్ల ట్రోలింగ్. చైతూతో విడాకుల తరువాత ఆమె మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది ఓ డ్రెస్ వల్ల. ఓ అవార్డు ఫంక్షన్ కు ఆమె ఇటీవల ముదురాకుపచ్చ, నలుపు కలగలిసిన గౌను వేసుకుంది. అది చాలా డీప్‌నెక్ తో ఉంది. ఎక్స్ పోజింగ్ ఎక్కువైందంటూ సమంతను ట్రోల్ చేశారు చాలా మంది. దీంతో సామ్ చాలా గట్టిగానే ప్రతిస్పందించింది. ‘మహిళను వారు వేసుకున్న డ్రెస్, చదువు, రంగు,రూపం, ఆర్ధిక పరిస్థితిని బట్టి జడ్జ్ చేయడం ఆపండి’ అని ఇన్ స్టా స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ కూడా వైరల్ అయింది. ఇంతగా సమంతను ఇబ్బందుల్లో పడేసి ఆ డ్రెస్ ధరెంతో తెలుసా? లక్షా ఎనభైవేల రూపాయలు. ఆన్ లైన్ సైట్లో ఈ గౌను అందుబాటులో ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఆ డ్రెస్ ప్రత్యేకంగా కుట్టించింది అయి ఉండదు, ఈ కామర్స్ సైట్లో కొన్నదే అని అర్థం అవుతోంది. ఈ కామర్స్ సైట్ లో అందుబాటులో ఉన్న ఆ డ్రెస్ ను ‘గౌరి అండ్ నైనిక’ అనే లేబుల్ మీద అమ్ముతున్నారు.
సమంత బోల్డ్ డ్రెస్సులు, డీప్ నెక్ డ్రెస్సులు వేసుకునేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఏ డ్రెస్ వేసుకోవాలన్నది స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన విషయంగా ఆమె భావిస్తుంది. ఆ ముదురాకుపచ్చ గౌను ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది సమంత. ఆ తరువాతనే గొడవంతా మొదలైంది. నిజానికి ఆ డ్రెస్‌లో సామ్ చాలా అందంగా కనిపిస్తోంది. కళ్లకు వింగ్డ్ ఐలైనర్ మేకప్, న్యూడ్ లిప్ స్టిక్, చెక్కిన కనుబొమ్మలతో చక్కని చుక్కలా ఉంది.
Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?