News
News
X

Nene Vasthunna Teaser: డ్యూయల్ రోల్‌లో ధనుష్ టెరిఫిక్ పెర్ఫార్మన్స్ - 'నేనే వస్తున్నా' టీజర్ చూశారా?

ధనుష్ నటించిన 'నేనే వస్తున్నా' సినిమా టీజర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 

తమిళ టాప్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.  తెలుగులో  'నేనే వ‌స్తున్నా' అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు.  తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించారు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సెల్వ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల (సెప్టెంబర్) 29న ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్. ఈ రెండు పాత్రల్లోనూ ధనుష్ గతంలో ఎప్పుడూ కనిపించని మాదిరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ విలన్ రోల్ పోషించడంతో కోలీవుడ్ లో ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా సన్నివేశాలతోనే సినిమాపై ఆసక్తి వచ్చేలా చేశారు మేకర్స్. డ్యూయల్ రోల్ లో ధనుష్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. మరి పూర్తి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే! 

ఇప్పటికే 'తిరు' సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో కొన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు ధనుష్. వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్‌ 'సార్' అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించనుంది.

'పొన్నియన్ సెల్వన్'తో ఢీ కొట్టనున్న ధనుష్: 
ధనుష్ నటించిన ఈ సినిమా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాతో పోటీకి దిగబోతోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'పొన్నియన్ సెల్వన్‌' ఈనెల 30న విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు రోజు ధనుష్ నటించిన 'నేనే వస్తున్నా' రిలీజ్ కానుంది.  ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలను ఒకేసారి విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
Published at : 15 Sep 2022 06:52 PM (IST) Tags: dhanush Selva Raghavan Nene Vasthunna Nene Vasthunna teaser

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!