News
News
X

Dhanush: బరిలోకి దిగిన ధనుష్ 'సార్' - ఇంకెన్ని పోటీకి వస్తాయో!

ధనుష్ 'సార్' సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

FOLLOW US: 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు. 

తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అడివి శేష్ 'హిట్2' కూడా రాబోతుంది. ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నారన్నమాట. నిజానికి ఇదే డేట్ న బాలకృష్ణ సినిమా కూడా వస్తుందని అనుకున్నారు. కానీ అది సంక్రాంతికి వెళ్లింది. మరిప్పుడు ధనుష్, అడివి శేష్ లతో పాటు ఇంకెవరైనా బరిలోకి దిగుతారేమో చూడాలి!

ఇక ధనుష్ 'సార్' సినిమా విషయానికొస్తే.. ఇందులో ఆయన 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అతడి లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది.

ధనుష్ నుంచి కొత్త సినిమా:

ఇటీవల 'తిరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ధనుష్ ఇప్పుడు మరో సినిమాతో అలరించబోతున్నారు. అదే 'నానే వరువెన్'. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.  తెలుగులో  'నేనే వ‌స్తున్నా' అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు.  తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించారు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సెల్వ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల (సెప్టెంబర్) 29న ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్. ఈ రెండు పాత్రల్లోనూ ధనుష్ గతంలో ఎప్పుడూ కనిపించని మాదిరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ విలన్ రోల్ పోషించడంతో కోలీవుడ్ లో ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది.

Also read: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ

Also read: అభినయశ్రీ ఎలిమినేషన్ - రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్, టాప్ 5లో ఆ ఇద్దరు!

Published at : 19 Sep 2022 02:22 PM (IST) Tags: Venky Atluri Dhanush SIR Dhanush sir movie release date

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!