News
News
X

Devatha August 23rd Update: దేవుడమ్మకి రాధని చూపించిన మాధవ, తీరిన భాగ్యమ్మ కోరిక- రెండ్రోజుల్లో నా భార్య, బిడ్డ ఇంటికి వస్తారని ఆదిత్య సవాల్

దేవుడమ్మఇంట్లో జరిగే బారసాల వేడుకకి రుక్మిణి వస్తుంది. దీంతో తనని ఎక్కడ దేవుడమ్మ చూస్తుందో అని టెన్షన్ పడుతుంది. రోజు రోజుకీ కథనం ఆసక్తిగా మారుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

తన ఇంట్లో ఉన్న రుక్మిణి చూసి ఆదిత్య షాక్ అవుతాడు. తనని దేవుడమ్మ ఎక్కడ చూస్తుందో అని అడ్డం వచ్చి నిలబడి కొంగు కప్పుకోమని చెప్తాడు. అందరూ కమల బిడ్డని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. రుక్మిణి ఎవరు అని జానకి దేవుడమ్మని అడుగుతుంది, రుక్మిణి అంటే నా కోడలు, ఇప్పుడు లేదు కానీ ఎక్కడో ఉంది, ఎక్కడ ఉందనేది తెలియడం లేదు. నన్ను అందరూ దేవుడమ్మ అని పిలిస్తూ ఉంటారు, కానీ నన్ను నిజమైన దేవుడమ్మని చేసింది నా కోడలు రుక్మిణి. అందుకే నా దృష్టిలో మాత్రం అదే దేవుడమ్మ అని చెప్తుంది. మీ కోడలు ఎక్కడికి రాదు అన్నారు మరి మాధవని అయినా తీసుకురాకపోయారా అని అడుగుతుంది. వాడికేదో పని ఉందని చెప్పాడు వీలు చూసుకుని వస్తాడులే అని జానకి చెప్తుంది. అప్పుడే మాధవ కారులో నుంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు.

ఇంట్లోకి వచ్చిన మాధవని చూసి రుక్మిణి షాక్ అవుతుంది. ఆదిత్య రుక్మిణి కనిపించలేదని చూస్తూ ఉంటాడు. ఏంటి రాధ చీరకొంగు కప్పుకుని ఎవ్వరికీ కనిపించకుండా వచ్చి అలాగే ఇంటికి తిరిగి వద్దామని అనుకున్నావా తప్పు కదా, రామూర్తిగారి కోడలు ఇలా చాటుగా రావాల్సిన ఖర్మ ఏంటి చెప్పు అని మాధవ అంటాడు. నేను మీ ఇంటి కోడలిని అని మంది అనుకుంటున్నారు నేను అనుకోవడం లేదని రాధ కోపంగా అంటుంది. కానీ అందరూ అనుకునేదే నమ్ముతారు. కాదు అని నువ్వు చెప్పలేవు అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ దాగుడు మూతలు ఎందుకు అని మాధవ అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు సారు అని రాధ తిడుతుంది. ‘నాకు కావాల్సింది నువ్వు అందరి ముందుకు రావడం అక్కడ అందరి ముందు దేవిని పిలిచి నాన్న మీ నాన్న ఎవరమ్మా అని అడుగుతారు. అప్పుడు దేవి ఇదిగో అని మా నాయన అని నన్ను చూపిస్తుంది, మీ అమ్మ ఎవరని అడిగితే నిన్ను చూపిస్తుంది అప్పుడు అందరి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకో మీ అత్తయ్య గుండె ఆగిపోదు’ అని అంటూ మాట్లాడుతూ ఉండగా దేవుడమ్మ అటు వైపు వచ్చి మాధవ్‌ని చూసి పిలుస్తుంది.

Also Read: కన్న తండ్రి యష్‌ని అసహ్యించుకుంటున్న ఆదిత్య- కొడుకు ఫోన్ చెయ్యడంతో సంతోషంలో యష్

నీ భార్య ఏంటి ఎప్పుడు కంటికి కనిపించకుండా ఉంటుందని దేవుడమ్మ అడుగుతుంది. మీరంటే తనకి చాలా అభిమానం అని చెప్తాడు. విచిత్రంగా ఉందే అంత అభిమానం ఉన్నప్పుడు రావడానికి ఇబ్బంది ఏంటి తను రాదు, నేను ఇంటికి వచ్చినా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటుందని దేవుడమ్మ అంటే ఈరోజు తప్పించుకోలేదులెండి అని మాధవ్‌ తనవైపు చూస్తూ అంటాడు. దేవి కూడా రావాలని చెప్పింది కాబట్టి తప్పకుండా వస్తుందేమో అని మాధవ్‌ అంటాడు. అదేంటి నీతో రానిది ఒక్కటే వస్తుందా అంటే ఏమో ఇలా ముసుగేసుకుని చాటుగా వచ్చి చూసి వెళ్లిపోతుందేమో అని రాధ నిలబడిన వైపు చెయ్యి పెట్టి చూపించేసరికి దేవుడమ్మ అటు చూసి ముసుగేసుకున్న ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తను రాధ అని మాధవ్‌ చెప్పేస్తాడు. మళ్ళీ రాధ కాదు తన ఫ్రెండ్ మాకు బాగా కావాల్సిన అమ్మాయి అని కవర్ చేస్తాడు. రాధే కాదు తన స్నేహితురాలు కూడా మొహమాటస్తురాలిగా ఉందిగా అని అంటుంది. అప్పుడే భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి రాధ స్నేహితురాలంట బాగా మోహమాటపడుతుంది. తనని తీసుకెళ్ళి అక్షింతలు ఇచ్చి బిడ్డని ఆశీర్వదించమను చీర పెట్టి పంపించు అని చెప్తుంది. సరే అని తన దగ్గరకి వెళ్ళేసరికి రుక్మిణి మొహం చూపిస్తుంది. ఏంటి బిడ్డ దేవుడమ్మ చూడలేదు కదా అని టెన్షన్ పడుతూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది.

ఆదిత్య రుక్మిణి ఏది అని వెతుకుతూ ఉంటే మాధవ్‌ ఎదురు పడతాడు. ఏంటి ఆఫీసర్ ఎవరి కోసం వెతుకుతున్నావ్ రాధ కోసమా అని అంటాడు. అదేంటి కనిపించలేదా వచ్చింది కదా అని మాధవ్‌ అంటే ‘రమ్మంది నేనే కదా రాకుండా ఎలా ఉంటుంది? ఏంటి షాక్ అయ్యవా? ఇది మా ఇంటి ఫంక్షన్ రాకుండా ఎలా ఉంటుంది. రుక్మిణి వస్తుందని నాకు తెలుసు ఇక్కడ ఏదో చెయ్యడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు నేను గెస్ చేసినట్టే వచ్చావ్. కానీ నువ్వేమి చేయలేవు మాధవ. ఇది రుక్మిణి ఇల్లు మేమంతా తన మనుషులం. తనని ఆదరించింది, ఆశ్రయం ఇచ్చింది మీ అమ్మానాన్నలు వాళ్ళకి లేని ఇబ్బంది నీకేంటి? ఎందుకు నా కూతుర్ని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నావ్ ఈరోజు రాధ.. కాదు రుక్మిణి నా ఇంటికి వచ్చింది. ఆపకుండా ట్రై చేసి ఉంటావె కానీ ఆపగలిగావా. ఈరోజు ఇంటి వరకు వచ్చినా నా భార్య నా కూతురు రెండు రోజుల్లో శాశ్వతంగా ఇంటికి వచ్చేలా చేస్తాను’ అని ఆదిత్య చెప్తాడు.

Also Read:  రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

అది అంత సులువు కాదని మాధవ అంటాడు. నా భార్య, నా బిడ్డ ఇంటికి వస్తారు ఎలా వస్తారో చూస్తూ ఉండమని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. రెండు రోజుల్లో ఇద్దరు ఇంటికా ఎలా ఆ ఛాన్స్ నేను పొరపాటున కూడా ఇవ్వను అని మాధవ్‌ అనుకుంటాడు. భాగ్యమ్మ రుక్మిణిని ఇంట్లోకి తీసుకొచ్చి కమల, సత్యతో కలిసి బిడ్డని ఆశీర్వదించమని అక్షింతలు ఇస్తుంది. ముగ్గురు కలిసి బిడ్డకి అక్షింతలు వెయ్యడం చూసి భాగ్యమ్మ మురిసిపోతుంది.

Published at : 23 Aug 2022 07:56 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial August 23

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు