By: ABP Desam | Updated at : 27 Jan 2023 06:26 PM (IST)
Edited By: Mani kumar
Image Crtedit:Shanmukh Jaswanth/Deepthi Sunaina/Instagram
ఒకప్పుడు కేవలం సినిమా, రాజకీయ రంగాల వారే ఎక్కువగా సెలబ్రెటీలుగా కనిపించేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెట్టింట్లో నుంచే చాలామంది సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ను కెరీర్ గా ఎంచుకొని యూట్యూబ్ స్టార్ లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలా యూట్యూబ్ నుంచి వచ్చి.. సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు షన్ముఖ్ జస్వంత్(షన్ను), దీప్తి సునయన. వీరిద్దరి కాంబోకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. మొదట్లో వీరిద్దరూ కలసి కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో నటించారు. కవర్ సాంగ్ లు కూడా చేశారు. తర్వాత వీరి పరిచయం కాస్త స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎవరి సాంగ్ లు వారు విడిగా చేసుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వీడియో సాంగ్ లను విడుదల చేశారు. మరి వీరి పాటలకు ఎవరికి ఎన్ని వ్యూస్ వచ్చాయో మీరే చూడండి..
బ్రేక్ తర్వాత షన్ను, దీప్తి మళ్లీ కలసి నటించడమే కాదు కదా.. కనీసం ఎక్కడా కలసినట్టుగా కూడా కనిపించడం లేదు. మొన్నా మధ్య ఓ ప్రైవేటు ప్రోగ్రామ్ లో కలిసి కనిపించినా మాట్లాడుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరి ఈ నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరు పోటా పోటీగా పాటలు విడుదల చేయడంతో ఈ పాటలపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా షన్ను యూట్యూబ్ ఛానెల్ కు 4.37 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
అలాగే దీప్తి సునయన యూట్యూబ్ ఛానెల్ కు 1.37 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే దీప్తి ఈ నెల 18న తన ‘ఏమోనే’ మ్యూజికల్ వీడియో సాంగ్ ను య్యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. అలాగే షన్ను తన ‘జాను’ పాటను రెండు రోజుల తర్వాత జనవరి 20న యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అయితే షన్ను విడుదల చేసిన ‘జాను’ పాటకు 2.8 మిలియన్ వ్యూస్, 209 వేల లైక్స్ వచ్చాయి. అలాగే దీప్తి విడుదల చేసిన ‘ఏమోనే’ పాటకు తన ఛానెల్ లో ఏకంగా 5.5 మిలియన్ వ్యూస్, 246 వేల లైక్స్ లు వచ్చాయి. అయితే ఇది ఈరోజు వరకూ ఉన్న వ్యూస్ మాత్రమే భవిష్యత్ లో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే షన్ను పాట కంటే దీప్తి విడుదల చేసిన పాటకే ఎక్కువ వ్యూస్ రావడం గమనార్హం.
షన్ను, దీప్తిల కాంబోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బిగ్ బాస్ షో వలన వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. బిగ్ బాస్ రెండో సీజన్ లో దీప్తి తనీష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం, అలాగే ఐదో సీజన్ లో షన్నూ సిరితో క్లోజ్ గా మూవ్ అవ్వడం వంటి కారణాల వల్లే వీరిద్దరూ విడిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం, ఇలా విడి విడిగా పాటలు చేయడం వారి ఫ్యాన్స్ కు అంతగా నచ్చడం లేదు. అందుకే కొంత మంది సోషల్ మీడియాలో షన్ను, దీప్తి మళ్లీ కలసిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు మళ్లీ వీరిద్దరూ కలసి కనిపిస్తారో లేదో చూడాలి.
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
నిజామాబాద్లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?