అన్వేషించండి

DD3 Concept Poster: ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా, కాన్సెప్ట్ పోస్టర్‌ అదిరింది గురూ!

DD3 Concept Poster: తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో ‘DD3’ అనే మూవీ తెరకెక్కబోతోంది. తాజాగా మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఆయన షేర్ చేశారు.

Dhanush Third Directorial Venture ‘DD3’ Concept Poster Released: తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును ప్రకటించారు. ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి.

‘DD3’ కాన్సెప్ట్ పోస్టర్‌ విడుదల

తాజాగా ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్‌ ను షేర్ చేశారు ధనుష్. ఈ పోస్టర్ చాలా ప్రెజెంట్ గా కనిపిస్తోంది.  బీచ్‌లో పసుపు రంగా బెంచ్, దాని మీద ఏదో రాసిన ఉన్న పలు పేపర్లు కనిపిస్తున్నాయి.  అటు ఆకాశం, ఇటు సముద్రం కలిసి పోయినట్లు ఆహ్లాదంగా ఉంది.  ప్రేమకథను సూచించే సెట్టింగ్ తో పాటు టీజర్ పోస్టర్ ప్రకటన తేదీని కూడా ఇందులో ప్రస్తావించారు. D అక్షరాన్ని పోలి ఉండే రెండు నెలవంకలు తన మూడో వెంచర్ కు సింబాలిక్ గా 3వ నంబర్ వచ్చేలా చక్కగా పోస్టర్ ను రూపొందించారు. ఇక ‘DD3’ కాన్సెప్ట్ పోస్టర్ కు పైన ఎడమ భాగంగాలో వండర్ బార్ ఫిల్మ్స్ లోగో కనిపిస్తుంది. అంటే, ఈ సినిమా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు అర్థం అవుతోంది. 

ఈ నెల 24న అధికారిక ప్రకటన

సినిమా టైటిల్, నటీనటుల వివరాలు బయటకు రాకపోయినప్పటికీ, మూవీకి సంబంధించి డిసెంబర్ 24, 2023 నాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ధనుష్ దర్శకుడిగా తన రెండవ ప్రాజెక్ట్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘D50’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఆయన తాజాగా ధన్యవాదాలు చెప్పారు. ట్విట్టర్ వేదికగా సినిమాలో భాగస్వామ్యం అయిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. అటు తన విజన్ కు సపోర్టు చేసిన కళానిధి మారన్ తో పాటు సన్ పిక్చర్స్‌ కు థ్యాంక్స్ చెప్పారు.

‘పా పాండి’తో దర్శకుడిగా పరిచయమైన ధనుష్

తమిళ నటుడు ధనుష్ 2017లో కామెడీ చిత్రం ‘పా పాండి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ధనుష్ తన తర్వాతి చిత్రం  ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్‌లతో కలిసి చేస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్‌’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ సినిమా విడుదల రోజునే రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే,  ధనుష్ మూవీతో పోటీ వద్దు అనే ఉద్దేశంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.  

Also Read: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget