అన్వేషించండి

Chiranjeevi: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?

Chiranjeevi: పాన్ ఇండియన్ మూవీ ‘సలార్‘పై మెగాస్టార్ ప్రశంసల జల్లు కురిపించారు. నటీనటులతో పాటు దర్శకుడు, టెక్నికల్ టీమ్ ను పేరు పేరున అభినందించారు. చిరు ప్రశంసలపై ప్రభాస్ స్పందించారు.

Chiranjeevi about Salaar: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సలార్‘ థియేటర్లకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ విడుదలయ్యింది. కనీవినీ ఎరుగని అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ‘కేజీఎఫ్’ చిత్రాలతో సంచలన సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, ‘బాహుబలి’ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా నటించడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు అనుగుణంగానే అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు జరిగాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఏకంగా రూ. 50 కోట్ల మేర జరిగింది. భారత్ తో పాటు విదేశాల్లోనూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.

సలార్ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు

ఇప్పటికే ‘సలార్‘ మూవీకి హిట్ టాక్ రావడంతో సినీ ప్రముఖులు తమ రెస్పాన్స్ ని తెలుపుతున్నారు. మూవీ అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. నటీనటులు, దర్శకుడితో పాటు టెక్నకల్ టీమ్ పైనా ఆయన అభినందనలు కురిపించారు. ప్రస్తుతం చిరంజీవి రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “డియర్ ‘దేవా’ సలార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. ‘సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కుడోస్. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు అద్భుతంగా నటించారు. మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని చిరు రాసుకొచ్చారు. మెగాస్టార్ నుంచి అద్భుతమైన రివ్యూ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.  

చిరంజీవి రివ్యూపై స్పందించిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్

చిరంజీవి స్పందనపై పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ‘థ్యాంక్స్ బాస్’ అంటూ లవ్ ఎమోజీలు పెట్టారు. ప్రభాస్ సినిమాకు చిరు రివ్యూ మరింత బూస్టింగ్ ఇస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ప్రభాస్ ఎంత మీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే మాత్రం ఇంత త్వరగా రివ్యూ పెట్టాలా? యు ఆర్ ఆల్వేస్ గ్రేట్ బాస్” అంటూ మరికొంత మంది రియాక్ట్ అవుతున్నారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Read Also: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget