అన్వేషించండి

WAR 2: ‘వార్ 2’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో!

WAR 2 : హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్న సినిమా ‘వార్ 2’. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

‘WAR 2’ Movie Shooting: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ సినిమా తెరకెక్కబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ నెల 23 నుంచి ‘వార్ 2’ షూటింగ్

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 23 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది. ముందుగా హృతిక్ కు సంబంధించి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఏప్రిల్‌లో ఈ చిత్రబృందంతో కలవనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ‘వార్ 2’లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అటు ‘ఫైటర్’ మూవీ తర్వాత హృతిక్ ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో   దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా హృతిక్ సన్నివేశాలను కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఇద్దరి సన్నివేశాలను షూట్ చేయాలని భావిస్తున్నారు. 

‘వార్ 2’పై భారీగా అంచనాలు

అటు ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజిలో ఉంటాయోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్, సౌత్ స్టార్ హీరోలు కలిసి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా వెండితెరపై సంచలనాలను  సృష్టిస్తుందని భావిస్తున్నారు. మరపురాని సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం, క్యూట్ బ్యూటీ కియారా అద్వానీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ వెచ్చిస్తోందట. ఈ యాక్షన్ మూవీని 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.  

‘దేవర’ షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 'జనతా గ్యారేజ్' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Read Also: ‘హనుమాన్‘తో ‘శ్రీఆంజనేయం‘ - ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Embed widget