అన్వేషించండి

Teja Sajja: ‘హనుమాన్‘తో ‘శ్రీఆంజనేయం‘ - ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ

‘హనుమాన్‘ హీరో తేజ సజ్జ తన సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేశాడు. హీరో నితిన్ తో కలిసి తీసుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ‘హనుమాన్‘ తో ‘శ్రీఆంజనేయం‘ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Teja Sajja Shared An Interesting Pic: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్‘. సంక్రాంతి కానుకగా జనవరి 12న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుత ఆదరణ దక్కించుకుంది. పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర ధూంధాం చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సుమారు రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసి సత్తా చాటింది.  

‘హనుమాన్’కు సీక్వెల్ గా ‘జై హనుమాన్’

‘హనుమాన్‘ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ఎండ్ కార్డులోనే వెల్లడించారు. అంతేకాదు, ‘హనుమాన్‘ మూవీకి వంద రెట్లు అద్భుతంగా ‘జై హనుమాన్‘ ఉండబోతుందని చెప్పారు. ఈ మాటతో సీక్వెల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ లో రెండో సినిమాగా ‘జై హనుమాన్’ రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేరంగా కొనసాగుతున్నాయి. ‘జై హనుమాన్’ చిత్రంలో హనుమంతుగా తేజ సజ్జా మరోసారి కనిపించనున్నాడు. అయితే, మూవీ మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టూ తిరగుతుందని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో హనుమాన్ పాత్ర పోషించేది ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ అని కొందరు, రానా అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమాలో హనుమాన్ పాత్ర చేసేది ఎవరు? అనే విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.   

ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ

ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ఆసక్తి కలిగిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ‘హనుమాన్’ బ్యాగ్రాఫ్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘శ్రీ ఆంజనేయం’. నితిన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఛార్మీ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ హనుమంతుడిగా కనిపించారు. తాజాగా ఈ సినిమా హీరో నితిన్ ను తేజ సజ్జ కలిశాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో తేజ షేర్ చేశాడు. ఇందులో నితిన్, తేజ చక్కగా నవ్వుతూ కనిపించారు. ‘హనుమాన్’తో ‘శ్రీ ఆంజనేయం’ అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ‘జై హనుమాన్’ సినిమాలో నితిన్ కనిపించబోతున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  ఇక ‘హనుమాన్’ సినిమాలోఅమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా,  వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో  కనిపించింది. గెటప్ శ్రీను హనుమంతు ఫ్రెండ్ పాత్రలో నటించాడు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hanu⭐️Man (@tejasajja123)

Read Also: 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - స్టే కొనసాగించేందుకు నిరాకరణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Embed widget