Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Brahmanandam: సోషల్ మీడియాలో బ్రహ్మీ మీమ్స్ హల్ చల్ మామూలుగా ఉండదు. సందర్భంగా ఏదైనా సరే బ్రహ్మీ మీమ్ పడిందంటే నవ్వుల పువ్వులు పూయాల్సిందే!
Brahmanandam funny video: వెండితెర అయినా, బుల్లితెర అయినా, బ్రహ్మానందం కనిపించాడంటే నవ్వులు విరబూయాల్సిందే! చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు పగలబడి నవ్వాల్సిందే. స్క్రీన్ మీద బ్రహ్మి అడుగు పెట్టాడంటే వాతావరణం ఉల్లాసంగా మారిపోవాల్సిందే! నవ్వుల రారాజు బ్రహ్మానందం వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మందిని నవ్వించారు.
సోషల్ మీడియాలో ‘యానిమల్’ బ్రహ్మానందం హల్ చల్
సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దర్శకుడు చెప్పినట్లు 10 తరాలకు సరిపడ మీమ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినంద స్టఫ్ ఇచ్చారు బ్రహ్మానందం. కామెడీ, సీరియస్, కన్నింగ్ ఏదైనా సరే బ్రహ్మీ మీమ్స్ వచ్చిందంటే పటాసులా పేలాల్సిందే. తాజాగా ఆయనకు సంబంధించిన మరో స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘యానిమల్’ సినిమా ట్రైలర్ లో రణబీర్ కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఎడిట్ చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. పలు సినిమాల్లో ఆయన పాత్రలకు సంబంధించిన వీడియోలతో ఓ ట్రైలర్ ను రూపొందించారు. 1 నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘యానిమల్’ బ్రహ్మీని చూసి పడి పడి నవ్వుతున్నారు. ఇందులో బ్రహ్మనంద తండ్రిగా నాజర్‌ను చూపించారు. వారిద్దరి మధ్య సన్నివేశాలను ఇలా ఫన్నీగా క్రియేట్ చేశారు.
Nice edit. Brahmi as #Animal!
— idlebrain jeevi (@idlebrainjeevi) December 9, 2023
pic.twitter.com/Cd99kFj1Ms
ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల పారితోషికం
ఏడు పదుల వయసులోనూ కుర్రాడిలా చలాకీగా ఉంటారు బ్రహ్మానందం. ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. సినీ రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను, 2009లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇక రెమ్యునరేషన్ విషయంలో బ్రహ్మానందం భారీగా అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 2 కోట్ల వరకు తీసుకుంటారు. బ్రహ్మానందం ఆస్తుల విషయానికి వస్తే, సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాదిన ఎక్కువ పారితోషకం అందుకునే కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఆయనను మించి బ్రహ్మానందం రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం.
‘రంగమార్తాండ’ మూవీలో బ్రహ్మీ అద్భుత నటన
బ్రహ్మానందం ‘రంగమార్తాండ’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలో విడుదల అయ్యింది. ఇందులో ఆయన ప్రకాష్ రాజ్ మిత్రుడిగా కనిపించారు. ఈ సినిమాలో ఆయన పాత్రను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన పండించిన ఎమెషన్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ప్రేక్షకులు సినిమాలో బ్రహ్మాని చూసి కంటతడి పెట్టారు. ఈ సినిమాతో బ్రహ్మానందం తనలోని కొత్త కోణాన్ని చూపించారు.
Read Also: ‘ఫైటర్’ టీజర్ - హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ మూవీ, తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్
Read Also: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్