Bheemla Nayak: ఐదు టికెట్లు మా మొహాన కొడతారా? రానా ఫ్యాన్స్ హర్టు
నెల్లూరు జిల్లాలో రానా ఫ్యాన్స్ టికెట్స్ కోసం గొడవ చేస్తున్నారు. అన్ని టికెట్లు పవన్ అభిమానులకే ఇస్తున్నారని.. దగ్గుబాటి ఫ్యాన్స్ ని చిన్నచూపు చూస్తున్నారంటూ.. డిస్ట్రిబ్యూటర్లకు నిలదీస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన 'భీమ్లానాయక్' సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేశారో తెలిసిందే. దీంతో థియేటర్లలో రచ్చ మొదలైంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చాలా రోజులుగా తాము పవన్ ఫ్యాన్స్ నడుపుతున్నామని.. కానీ కొత్తగా వైసీపీ నుంచి ఓ వ్యక్తి పవన్ ఫ్యాన్స్ అని పోస్టర్ వేసుకున్నాడని ఓ వర్గం ఆరోపిస్తుంది.
అంతేకాదు.. థియేటర్ వాళ్లు అన్ని టికెట్లు వాళ్ళకే ఇచ్చేశారని గొడవకు దిగారు. సినిమా రిలీజ్ రోజు టికెట్స్ కోసం ఇలాంటి డ్రామాలు ఆడతారా..? అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఇప్పుడు వైసీపీ వర్గం వారు పవన్ ఫ్యాన్స్ అంటూ అసోసియేషన్ పెట్టడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్లు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ లో ఉండాలా..? ఉండకూడదా..? అనే చర్చ కూడా మొదలైంది.
ఇక నెల్లూరు జిల్లాలో రానా ఫ్యాన్స్ టికెట్స్ కోసం గొడవ చేస్తున్నారు. అన్ని టికెట్లు పవన్ అభిమానులకే ఇస్తున్నారని.. దగ్గుబాటి ఫ్యాన్స్ ని చిన్నచూపు చూస్తున్నారంటూ.. డిస్ట్రిబ్యూటర్లకు నిలదీస్తున్నారు. గతంలో 'అరణ్య' సినిమా వచ్చినప్పుడు రానా ఫ్యాన్స్ అసోసియేషన్ తరువాత టికెట్స్ అన్నీ బల్క్ గా కొన్నామని.. థియేటర్ ఓనర్స్ కి కలెక్షన్స్ కష్టం లేకుండా చేశామని అంటున్నారు రానా ఫ్యాన్స్.
ఇప్పుడు 'భీమ్లానాయక్' రిలీజ్ టైంలో ఐదు టికెట్లు మా మొహాన కొడతారా..? అంటూ మండిపడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు.. పవన్ ఫ్యాన్స్ కి ఇచ్చే ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని అంటున్నారు రానా ఫ్యాన్స్. ఇక 'భీమ్లానాయక్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోలతోనే భారీ కలెక్షన్స్ ను రాబట్టినట్లు సమాచారం.
View this post on Instagram