Citadel Web Series Telugu: తెలుగులోనూ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ - స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే!
ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో తెరెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
తెలుగులోనూ అందుబాటులోకి హాలీవుడ్ ‘సిటాడెల్’
తాజాగా అమెజాన్ ప్రైమ్ కీలక విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 28న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలిపింది. అంతేకాదు, తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ సిరీస్ కు సంబంధించిన కొత్త ట్రైలర్ ఇవాళ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా రెండు ఫోటోలను విడుదల చేసింది.
View this post on Instagram
ఆకట్టుకుంటున్న హాలీవుడ్ ‘సిటాడెల్’ టీజర్లు, పోస్టర్లు
ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని టీజర్లను అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన యాక్షన్ సీన్లతో నిండి ఉన్న టీజర్లు సిరీస్ పై ఓ రేంజిలో అంచనాలు పెంచుతున్నాయి. "మీకు తెలిసినదంతా అబద్ధం. నువ్వన్నది గతం. నువ్వు ఉండేవి సిటాడెల్" అంటూ స్టాన్లీ టుచీ చెప్పడంతో తొలి టీజర్ మొదలవుతుంది. ఇందులో ప్రియాంక నవ్వుతూ కనిపిస్తుంది. రిచర్డ్ ఎవరినో చూస్తున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత భారీ యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి. ఆ తర్వాత విడుదలైన పలు టీజర్లు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం ఆకట్టుకుంటోంది. ప్రియాంక చేతిలో గన్ పట్టుకుని సైలెంట్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు అందులో కనిపించింది. ‘సిటాడెల్’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్‌లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
బాలీవుడ్ లోనూ తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ సిరీస్
ఇదే ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతాను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది.
Read Also: ‘దసరా’లో ‘ఛత్రపతి‘ సర్ ప్రైజ్, నేరుగా థియేటర్లలో టీజర్ వదిలిన బెల్లంకొండ