Teja Sajja: ఆ పిక్ నా లైఫ్‌ను మార్చేసింది - మెగాస్టార్‌తో బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకున్న తేజ సజ్జా
Mirai Movie: యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ మిరాయ్ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Teja Sajja About His Career: 'హనుమాన్'తో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మరో సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీం ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోన్న తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ సహా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆ పిక్‌తోనే లైఫ్ చేంజ్
తన ఫ్యామిలీలో ఎవరూ ఇండస్ట్రీకి సంబంధించిన వారు లేరని చెప్పారు తేజ సజ్జా. మెగాస్టార్ చిరంజీవి 'చూడాలని ఉంది' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభమైనట్లు చెప్పారు. 'చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుల కోసం వందల కొద్దీ ఫోటోస్ వచ్చాయి. అందులో చిరంజీవి గారు నన్ను సెలక్ట్ చేశారు. ఆ తర్వాత మా నాన్నను నిర్మాత ఒప్పించారు. మెగాస్టార్ ఆ రోజు నా ఫోటో సెలక్ట్ చేసి ఉండకపోతే నేను ఈ రోజు ఇలా ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ ఒక్క ఫోటో నా జీవితాన్నే మార్చేసింది. అలా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా మూవీస్ చేశాను.' అంటూ చెప్పారు.
సొంత పిల్లాడిలా చూసుకుంటారు
చిరంజీవి తనను సొంత పిల్లాడిలా చూసుకుంటారని చెప్పారు తేజ. 'నేను చిన్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అందరి బాగోగులు చూస్తారు. హనుమాన్ మూవీ చూశాకు నాకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో నాకు సలహాలిచ్చారు. నేను పెద్దయ్యాక హీరో అవుతానంటే నా పేరెంట్స్ భయపడ్డారు. అయినా పట్టుదలతో పరిశ్రమలోకి వచ్చాను. 'ఓ బేబి' మూవీ టైంలో సమంత నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ మూవీ ప్రమోషన్స్‌కు కూడా నన్నే పంపేవారు. నా గురించి అందరికీ చెప్పేవారు.' అని తెలిపారు.
Also Read: మల్లెపూలతో ప్లేన్ ఎక్కిన హీరోయిన్ - బిగ్ షాక్ ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులు
వాళ్లు మోసం చేశారు
తాను హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తేజ చెప్పారు. 'ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టే నాపై నాకు నమ్మకం చాలా పెరిగింది. సినిమాల విషయంలో నన్ను చాలా మంది పెద్ద మనుషులు మోసం చేశారు. ఓసారి స్టార్ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పి ఓకే అనుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభించారు. 15 రోజుల షూట్ కంప్లీట్ అయ్యాక సెట్స్‌కు మరో హీరో వచ్చాడు. ఆ మూవీలో అతనే హీరో అని నాకు అర్థమైంది. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పడం కంటే ముందే ఆ హీరోకు డైరెక్టర్ కథ చెప్పారు. అతనికి సీన్స్ చూపించడం కోసమే నాతో మాక్ షూట్ చేశారని తెలిసింది.' అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'జై హనుమాన్' మూవీపై
'జై హనుమాన్' మూవీలో తాను ఉన్నానో లేదో కూడా తెలియదని తేజ సజ్జా చెప్పారు. 'ప్రశాంత్ వర్మ అఫీషియల్‌గా ఈ ప్రాజెక్టుపై ఏం ప్లాన్ చేశారో నాకు తెలియదు. మేమిద్దరం ట్రావెల్ అయ్యే స్టోరీస్ గురించే ఆయన డిస్కస్ చేస్తారు. వేరే కథల గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ రాదు.' అంటూ చెప్పారు.






















