అన్వేషించండి
Social Media Stars : Top 5 ప్రపంచంలోని టాప్ 5 సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వీళ్లే.. సంపాదన తెలిస్తే షాక్ అవుతారు
Top Digital Creators : సామాజిక మాధ్యమం ఇప్పుడు డబ్బులు సంపాదించేందుకు వేదికగా మారింది. ఎందరికో కెరీర్ ఇచ్చింది. అలా యూట్యూబ్లో సక్సెస్ అయిన వారు ఎవరో చూసేద్దాం.
డిజిటల్ క్రియేటర్స్, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపా
1/5

చార్లీ డి'అమెలియో 2019లో టిక్‌టాక్‌లో డాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో టిక్‌టాక్‌లో 100 మిలియన్ ఫాలోవర్లను పొందిన మొదటి కంటెంట్ క్రియేటర్‌గా నిలిచింది. 2022లో ఆమె డాన్సింగ్ విత్ ద స్టార్స్ టైటిల్ గెలిచింది. తరువాత ది డి'అమెలియో షో అనే రియాలిటీ సిరీస్‌ను కూడా ప్రారంభించింది. 2024లో ఆమె బ్రాడ్‌వేలో కూడా అడుగుపెట్టింది. ఆమె కుటుంబం ఇప్పుడు డి'అమెలియో బ్రాండ్స్ పేరిట ఫ్యాషన్, సౌందర్య సాధనాలు, ఇతర ప్రొడెక్ట్స్ సెల్ చేస్తున్నారు.
2/5

12 సంవత్సరాల వయసులో 'ర్యాన్ కాజీ' యూట్యూబ్లో ఫేమస్ అయిన పిల్లల్లో ఒకరు. 2015లో మొదలైన 'Dunnaya' ఛానెల్.. ర్యాన్స్ వరల్డ్‌లో అన్‌బాక్సింగ్ చేసే వీడియోలు, వ్లాగ్‌లు అప్‌లోడ్ అవుతాయి. 2018 నుంచి 2020 వరకు వారి ఛానెల్ మంచి గ్రోత్ సంపాదించుకుంది. తర్వాత దీనిని pocketwatchతో డీల్ చేసారు. 2024లో ర్యాన్స్ వరల్డ్ టైటాన్ యూనివర్స్ అడ్వెంచర్ అనే సినిమా కూడా తీశారు.
3/5

ఫెలిక్స్ ల్యాంగ్యెల్, xQcగా పేరుగాంచాడు. Twitchలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 29 ఏళ్ల xQc మొదట Overwatch ఈ-స్పోర్ట్స్ ప్లేయర్‌గా ఉండేవాడు. ఆ తర్వాత Twitchలో స్ట్రీమింగ్ ప్రారంభించాడు. 2019 నాటికి అతను ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా చూసే స్ట్రీమర్ అయ్యాడు. 2023లో అతను Kick అనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌తో దాదాపు $70 మిలియన్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
4/5

లోగన్ పాల్ 10 ఏళ్ల వయసులో యూట్యూబ్ ప్రారంభించాడు. కానీ అసలు గుర్తింపు Vine ద్వారా వచ్చింది. తరువాత అతను ప్యాడ్కాస్టింగ్, బిజినెస్, రెజ్లింగ్‌లోకి కూడా ప్రవేశించాడు. 2022లో WWE అతన్ని "Maverick" పేరుతో సంతకం చేసింది. అయితే లోగన్ చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా 2017లో జపాన్‌లో అతను వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశాడు. దానిపై విమర్శలు ఎదుర్కొని క్షమాపణ చెప్పాడు. ఆత్మహత్య నిరోధక సంస్థకు 1 లక్ష డాలర్లు విరాళంగా ఇచ్చాడు.
5/5

జేమ్స్ డొనాల్డ్సన్ని ప్రపంచం MrBeastగా పిలుస్తుంది. 26 ఏళ్లకే అత్యంత ధనవంతుడైన యూట్యూబర్‌గా నిలిచాడు. అతను 13 సంవత్సరాల వయస్సు నుంచి గేమింగ్ వీడియోలు చేయడం ప్రారంభించాడు. 2017లో 24 గంటల 1,00,000 వరకు లెక్కించే వీడియో వైరల్ అయింది. అక్కడి నుంచి అతని అదృష్టం మెరిసింది. అతను విజేతలకు కోట్లాది రూపాయల బహుమతిని అందించే అనేక టాస్క్‌లు పెట్టాడు. నెట్‌ఫ్లిక్స్ "Squid Game" ఆధారంగా రూపొందించిన షోలో అతను $456 మిలియన్ల బహుమతిని పొందాడు. దీనితో పాటు MrBeast Burger, Feastables, Lunchly వంటి ఆహార ఉత్పత్తులను కూడా ప్రారంభించాడు. ఇటీవల అతను Amazon Primeతో కలిసి "Beast Games" షో చేశాడు. ఇందులో $5 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ పొందాడు.
Published at : 08 Sep 2025 03:54 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















