Akhil Zainab Reception: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో జైనాబ్ మిస్సింగ్... ఆ ఒక్కటీ గమనించారా?
Akhil Akkineni Zainab Ravdjee Wedding Reception: అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి కొత్తజంటకు శుభాకాంక్షలు చెప్పారు.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా పలువురు రాజకీయ - సినీ ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. తమ రిసెప్షన్‌కు వచ్చిన అతిథులు అందరితో అఖిల్ - జైనాబ్ ఫోటోలు దిగారు. అయితే... ఒక్క ఫోటోలో అఖిల్ భార్య జైనాబ్ మిస్ అవ్వడం పలువురి దృష్టిలో పడింది.
అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో జైనాబ్ ఎక్కడ?
Why Zainab Ravadjee missing from Akkineni family photo? అఖిల్ జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలను గమనించారా? అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ దిగిన ఫోటోలో జైనాబ్ లేరు. కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, నాగ చైతన్యతో పాటు ఆయన భార్య శోభిత ధూళిపాళ - ప్రతి ఒక్కరు తమ జంటతో కనిపించారు. అఖిల్ మాత్రం తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్నారు. ఆయన పక్కన భార్య లేరు.
A moment filled with love, blessings, and togetherness. Grateful to have our family by our side.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
More memories to come… 💫❤️#AkhilZainabReception pic.twitter.com/kYlqFVRAkq
అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) వారసులు, వాళ్ళ జీవిత భాగస్వాములు కలిసి దిగిన ఫోటోలో అఖిల్ భార్య జైనాబ్ లేకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. రిసెప్షన్ ఫోటోలు గమనిస్తే... మిగతా అన్నిటిలోనూ జైనాబ్ ఉన్నారు. ఒక్క ఫ్యామిలీ ఫోటోలో తప్ప! అందుకే ఈ పాయింట్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది.
Also Read: పెళ్లి చీరలో జైనాబ్ రావ్జీ... అఖిల్ అక్కినేని భార్య ఎంత అందంగా ఉందో చూశారా? ఈ ఫోటోలపై లుక్ వేయండి
అక్కినేని ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. నాగ చైతన్యతో పెళ్లి కాకముందు ఏఎన్నార్ అవార్డు వేడుకకు శోభిత ధూళిపాళ హాజరు అయ్యారు. పెళ్లి కాకపోయినా తమ ఫ్యామిలీ ఫోటోలు ఆవిడకు కూడా చోటు కల్పించింది అక్కినేని కుటుంబం. ఇప్పుడు జైనాబ్‌ను పిలవకుండా ఉండరు. ఆ ఫోటో దిగే సమయానికి ఆవిడ వేదిక దగ్గరకు వచ్చి ఉండకపోవచ్చు. ఆ విషయం ఫోటోలు చూసే సామాన్య ప్రేక్షకులకు తెలియదు కదా! మిస్సింగ్ పాయింట్ ఒక్కటే అందరి దృష్టిలో పడుతుంది.





















