అన్వేషించండి

Sravani Shetty: హీరోయిన్‌గా వస్తున్న మరో యూట్యూబర్ - ఆ సినిమా ఏదో తెలుసా?

Kousalya Tanaya Raghava Movie: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులరైన అమ్మాయి శ్రావణి శెట్టి. రాజేష్ కొంచాడాకు జంటగా ఆమె నటించిన సినిమా 'కౌసల్య తనయ రాఘవ'.

'బేబీ' సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్ అయ్యింది. వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్', 'మామ మశ్చీంద్ర' సినిమాల్లో నటించిన మృణాళిని రవి సైతం టిక్ టాక్, డబ్ స్మాష్ ద్వారా పాపులరైన అమ్మాయే. దివ్య శ్రీపాద, శివానీ నాగారం తదితర అమ్మాయిలు యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా పాపులరై సినిమాల్లోకి వచ్చిన వారే. ఇప్పుడు ఈ జాబితాలో మరో అమ్మాయి యాడ్ అవుతోంది. ఆమె పేరు శ్రావణి శెట్టి. ఆమె తొలి సినిమా విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  

'కౌసల్య తనయ రాఘవ'తో...
శ్రావణి శెట్టి కథానాయికగా పరిచయం అవుతున్న సినిమా 'కౌసల్య తనయ రాఘవ. రాజేష్ కొంచాడా జోడీగా ఆమె నటించారు. ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వామి పట్నాయక్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు సిద్ధమైందని, త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.

Also Readశర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్‌ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by swami patnaik director (@patnaikswami)

1980 నేపథ్యంలో 'కౌసల్య తనయ రాఘవ''కౌసల్య తనయ రాఘవ' అందమైన కుటుంబ ప్రేమ కథా చిత్రమని దర్శక నిర్మాతలు స్వామి పట్నాయక్, అడపా రత్నాకర్ తెలిపారు. ఇంకా సినిమా గురించి వారు మాట్లాడుతూ... ''ఫీల్ గుడ్, వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో అటువంటి ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా 'కౌసల్య తనయ రాఘవ'ను తీశాం. సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంటుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక మనిషికి మరో మనిషి ఇచ్చే విలువల మీద, ఒక మనసుకి ఇంకొక మనసు మీద ఉండే స్వచ్ఛమైన నిజాయతీ ప్రేమ మీద తీసిన చిత్రమిది. 1980వ సంవత్సరం నేపథ్యంలో కథ సాగుతుంది'' అని చెప్పారు.

Also Readఎన్టీఆర్ 'దేవర'కు బాలీవుడ్‌లో భారీ డిమాండ్... రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి!


ఆల్రెడీ 'కౌసల్య తనయ రాఘవ' సినిమాలో మూడు పాటలను మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన వచ్చిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. పాలకొండ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Also Readప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ


Kousalya Tanaya Raghava Movie Cast And Crew: రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా నటించిన 'కౌసల్య తనయ రాఘవ' చిత్రానికి నిర్మాత: అడపా రత్నాకర్, నిర్మాణ సంస్థ: ఏఆర్ మూవీ మేకర్స్, రచన - దర్శకత్వం: స్వామి పట్నాయక్, సంగీతం: రాజేష్ రాజ్ తేలు, కూర్పు: శ్రీ కృష్ణ ప్రసాద్, ఛాయాగ్రహణం: యోగి రెడ్డి, సాహిత్యం: అర్జిత్ అజయ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget