(Source: ECI/ABP News/ABP Majha)
Praneeth Hanumanthu Arrest: ప్రణీత్ హనుమంతు అరెస్ట్ - ఏపీ, తెలంగాణలో కాదు... ఎక్కడ పట్టుకున్నారో తెలుసా?
Youtuber Praneeth Hanumanthu: యూట్యూబర్, ఓ వీడియోలో తండ్రీ కుమార్తెల అనుబంధం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
Praneeth Hanumanthu Arrested In Bengaluru: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మీద సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరి డిమాండ్ ఒక్కటే... ఆయన్ను అరెస్ట్ చేయాలని! డార్క్ హ్యూమర్ పేరుతో తండ్రీ కుమార్తెల బంధం మీద హేయమైన, రాయలేని భాషలో వెకిలి కామెడీ చేసిన ఆ యూట్యూబర్ కటకటాల వెనుక ఉండాలని అందరూ కోరుకున్నారు. ఆ కోరిక ఈ రోజు ఫలించింది. అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
బెంగళూరులో ఫనుమంతు అరెస్ట్!
ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా స్పష్టం అయ్యింది. అతడు నివసించేది హైదరాబాద్ సిటీలోనే. బేగంపేట ఏరియాలో ఉంటాడు. అయితే... అతడి అన్నయ్య బెంగళూరు సిటీలో ఉంటున్నాడు. అతడి దగ్గరకు వెళ్లగా... నయా టెక్నాలజీ ద్వారా ఫనుమంతు అలియాస్ ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఎట్టకేలకు హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు - పోలీసులకు కీలక ఆధారాలు సమర్పించిన ప్రియురాలు
#PraneethHanumanthu Arrested!!
— Movies4u Official (@Movies4u_Officl) July 10, 2024
The Telangana Cyber Security Bureau has arrested the controversial YouTuber #PraneethHanumanthu in Bengaluru.
He will be transferred to Hyderabad shortly after completing the legal formalities there. pic.twitter.com/QGJQVtqrag
బెంగళూరు కోర్టులో హాజరు పరిచిన తర్వాత...
ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్ట్ చేసినప్పటికీ... అతడి మీద కేసులు నమోదు అయ్యింది మాత్రం హైదరాబాద్ సిటీలో! టాలీవుడ్ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ సోషల్ మీడియా వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా ఉప ముఖ్యమంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులకు ప్రణీత్ హనుమంతు మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ స్పందించి కేసులు నమోదు చేశారు. విమెన్ సేఫ్టీ వింగ్ సైతం స్పందించింది.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
తెలంగాణలో ప్రణీత్ హనుమంతు మీద కేసు నమోదు కావడంతో అతడికి ఇక్కడికి ట్రాన్సిట్ ఆర్డర్ మీద తీసుకు రానున్నారు. ముందుగా ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరు పరిచి... ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు.
ప్రణీత్ హనుమతుకు కఠిన శిక్ష విధించాలి!
డార్క్ హ్యూమర్ కావచ్చు, మరొకటి కావచ్చు... భవిష్యత్తులో యూట్యూబర్ లేదా మరొక వ్యక్తి ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రణీత్ తండ్రి ఐఏఎస్ అధికారి అయినప్పటికీ... అతడిని అరెస్ట్ చేయడం ద్వారా తప్పు చేసి వ్యక్తులు అందరూ చట్టం ముందు సమానం సంకేతాలను ప్రజల్లోకి పోలీసులు బలంగా పంపించారు. మరి, విచారణ ఏ విధంగా జరుగుతుందో? అతడికి ఏ విధమైన శిక్ష పడుతుందో? వెయిట్ అండ్ వాచ్.