అన్వేషించండి

Mr Bachchan: రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంతే - 'మిసర్ బచ్చన్'లో ఫస్ట్ సాంగ్ సితార్ లిరికల్ వీడియో చూశారా?

Mr Bachchan First Single: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సితార్'ను విడుదల చేశారు. 

Watch Sitar Song Lyrical Video From Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ  (Ravi Teja) హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా (నా పేరు వినే ఉంటారు)... అనేది ఉప శీర్షిక. 'షాక్', 'మిరపకాయ్' తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇవాళ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'సితార్'ను విడుదల చేశారు. 

భాగ్య శ్రీతో రవితేజ కెమిస్ట్రీ అదుర్స్ అంతే!
'మిస్టర్ బచ్చన్' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'సితార్'ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మాంచి మెలోడియస్ ట్యూన్ ఇవ్వగా... సాకేత్ కోమండూరి, సమీరా భరద్వాజ్ అంతే అందంగా పాడారు. ఈ పాటను లిరిసిస్ట్ సాహితి రాశారు.

'సితార్' పాట ఎంత వినసొంపుగా ఉందో... ఆ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ అంత కంటే ఎక్కువ అందంగా ఉంది. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో విదేశాల్లో అందమైన లోకేషన్లలో పాటను తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు వేసిన స్టెప్పుల్లో రొమాన్స్, హుషారు కనిపించాయి. రవితేజ యంగ్ లుక్ అదిరిందంతే!

Also Readకన్నడలో మరో భారీ పీరియాడిక్ ఫిల్మ్ - Shiva Rajkumar లుక్కు చూశారా... 'భైరవన కోనే పాఠ' ప్లానింగ్ పెద్దదే

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక...' పాటతో పాటు 'దువ్వాడ జగన్నాథం - డీజే' సినిమాలో 'అస్మైక యోగ...' పాటను సైతం సాహితి రాశారు. మరోసారి వీళ్లిద్దరి కలయికలో 'సితార్' హిట్ సాంగ్ అని చెప్పాలి.

ఆగస్టు 15న విడుదల చేస్తారా?
పనోరమా స్టూడియోస్ & టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇటీవల చిత్రీకరణ అంతా పూర్తి అయ్యింది. కొన్ని రోజుల క్రితం షో రీల్ విడుదల చేయగా... మంచి స్పందన లభించింది. మాస్ మహారాజా రవితేజ రాంపేజ్ అదుర్స్ అన్నారంతా! ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు గానీ, చిత్ర బృందంలోని సభ్యులు గానీ అధికారికంగా చెప్పలేదు. 

Also Readరష్మీ గౌతమ్, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ


'మిస్టర్ బచ్చన్'తో ఉత్తరాది భామ భాగ్య శ్రీ బోర్సే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఛాయాగ్రహణం: అయనంక బోస్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్ర సమర్పణ: పనోరమా స్టూడియోస్ & టి సిరీస్, సంగీతం: మిక్కీ జె మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: టీజీ విశ్వ ప్రసాద్, రచన - దర్శకత్వం: హరీష్ శంకర్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget