అన్వేషించండి

Hema Case: నటి హేమకు మంచు విష్ణు షాక్!‌ - 'మా' సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..

Manchu Vishnu Cancel Hema MAA Membership: నటి హేమ అరెస్ట్‌పై మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆమె మా సభ్యత్వం రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Actress Hema MAA Membership Will Be cancel: సినీ నటి హేమ బెంగళూరు రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. హేమ అరెస్ట్‌ ఆమె మా నుంచి సస్పెండ్‌ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హేమ మా సభ్యత్వంపై మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హేమ మా సభ్యత్వం రద్దుపై ఆయన సభ్యుల అభిప్రాయాలు సేకరించారట. ఈ మేరకు మా అసోసియేషన్‌ గ్రూప్‌లో ఇప్పటికే మంచు విష్ణు సందేశాలు పంపించారని సమాచారం.

దీనిపై ప్యానెల్ సభ్యుల నుంచి హేమ సభ్యత్వం రద్దు చేయాల్సిందే అన్నట్టు సమాధానాలు రావడంతో మంచు విష్ణు దీనిపై ఫైనల్‌ డెసిజన్‌‌ తీసుకున్నట్టు సినీవర్గాల్లో సమాచారం. ప్యానెల్‌ సభ్యుల అభిప్రాయాల మేరకు మా అధ్యక్షుడిగా విష్ణు హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. రేపు(జూన్‌ 6) ఆయన దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారట.  రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్‌ చిట్‌ వచ్చేంతవరకు ఆమెను మా నుంచి సస్పెండ్‌ చేయాలని ఆయన నిర్ణయం తీసున్నట్టు తెలుస్తోంది. 

కాగా గత మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో హేమ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె దొరకడంతో కవర్‌ చేసుకునేందుకు తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్టుగా డ్రామాలు ఆడింది. బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసినట్టు చెప్పిన కూడా వాటిని కొట్టిపారేసింది. ఆమె రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చి రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం హేమను పోలీసుల రిమాండ్‌లోనే ఉంది.

ఫేక్‌ వీడియోతో హేమ డ్రామాలు

తొలుత మే 20న బెంగళూరులో రేవ్ పార్టీ విషయం బయటికి రాగానే అందులో హేమ కూడా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పార్టీలో హేమ కూడా ఉందని, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ స్వయంగా బెంగళూరు పోలీసులే వెల్లడించారు. అయినా కూడా ఈ విషయం బయటకు రాగానే హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేసింది. కానీ, బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఫోటోలు విడుదల చేయడంతో.. హేమ చేసినది ఫేక్ వీడియో అని తేలిపోయింది. అంతేకాదు ఆ మరసటి రోజు తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ వండుతున్న వీడియో షేర్‌ చేసింది.

ఈ వీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇదంతా కావాలనే చేస్తుందని, హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నానని చెప్పేందుకు డ్రామాలు చేస్తుందంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. ఇక బెంగళూరు పోలీసులు తమ విచారణలో భాగంగా పార్టీకి హాజరైన అందరి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయించారు. ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్‌గా తేలింది. అలా పాజిటివ్ వచ్చిన వారు అందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే క్రమంలో నటి హేమకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఆమె అనారోగ్యం కారణంగా గైర్హాజరు కాగా.. ఇప్పుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget