అన్వేషించండి

National Awards: పృథ్వీరాజ్‌కు నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? 'లగాన్', 'జోధా అక్బర్' దర్శకుడే కారణమా?

Prithviraj Sukumaran: 'ఆడు జీవితం - గోట్ లైఫ్'లో నటనకు మలయాళ హీరో పృథ్వీరాజ్ నేషనల్ అవార్డు అందుకుంటారని ఆడియన్స్ భావించారు. ఆయనకు అవార్డు రాకపోవడానికి అశుతోష్ గోవారికర్ కారణమా?

జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు (2023 సంవత్సరానికి గాను) విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉత్తమ నటుడు అవార్డు మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ఎంపిక తీరును కొంత మంది విమర్శించారు. చాలా కేటగిరీల్లో ఇచ్చిన అవార్డుల మీద జనాలు తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా 'ఆడు జీవితం - ది గోట్ లైఫ్' చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై మలయాళీలు ఫైర్ అవుతున్నారు. 'జవాన్' సినిమాలో షారుఖ్ ఖాన్ నటనకు అవార్డు ఇచ్చారు కానీ 'ది గోట్ లైఫ్', అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన మీకు కనిపించలేదా? అని నెటిజన్లు సైతం మండి పడ్డారు.

పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఎందుకు మిస్...
'లగాన్', 'జోధా అక్బర్' దర్శకుడు కారణమా?
ఎందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడు కాలేదు? ఈ కాంట్రవర్సీ మీద మలయాళీ ఫిల్మ్ మేకర్, జ్యూరీ సభ్యుడు ప్రదీప్ నాయర్ స్పందించారు. 'కేరళ స్టోరీ'కి అవార్డులు ఎలా ఇస్తారు? కేరళ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా చిత్రాన్ని తీశారని ప్రదీప్ నాయర్ వాదించాడట. కానీ జ్యూరీ సభ్యులంతా కూడా 'కేరళ స్టోరీ'కే అవార్డులు కట్ట బెట్టారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్నే చూపించారని, సినిమాలో టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నాయని అవార్డులు ఇచ్చారట.

Also Read: అవంతికను బాహుబలి రేప్ చేయలేదు... సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వివాదంపై తమన్నా రియాక్షన్

'ఆడు జీవితం' (ది గోట్ లైఫ్) సినిమా కోసం కూడా ప్రదీప్ నాయర్ వాదించారట. ఎన్నో కేటగిరీల్లో 'ది గోట్ లైఫ్‌'ను సబ్ మిట్ చేశారట. కానీ ఏ ఒక్క కేటగిరీల్లోనూ అవార్డు సంపాదించుకోలేకపోయిందట. జ్యూరీ చైర్ పర్సన్ - 'లగాన్', 'జోధా అక్బర్' సినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాత్రం ఒప్పుకోలేదట. 'ది గోట్ లైఫ్' సినిమాను చూసి ఆయన కన్విన్స్ కాలేదట. అందులో కథ, నటన ఇవేవీ కూడా అథెంటిక్‌గా లేవని, తనకు సహజంగా అనిపించలేదని అశుతోష్ గోవారికర్ స్పష్టం చేశారట. జ్యూరీలో అందరికీ అలానే అనిపించిందట. అందుకే ఉత్తమ చిత్రం కానీ, ఉత్తమ నటుడు అవార్డు కూడా ఇవ్వలేదని ప్రదీప్ నాయర్ తెలిపారు.

బెస్ట్ ప్లే బ్యాక్ మేల్ సింగర్ కేటగిరీలోనూ 'ది గోట్ లైఫ్‌'ను పంపారట. కానీ అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ లిరిక్స్‌ను సరిగ్గా సబ్ మిట్ చేయలేదట. అలా జ్యూరీ సభ్యులు సినిమాపై అసంతృప్తితో ఉండటంతో ఏ అవార్డు కూడా రాలేదట. కానీ ‘ఉల్లోళుక్కు’ (UlloZhukku) చిత్రానికి మాత్రం జ్యూరీ ఫిదా అయిందట. అందుకే ఉత్తమ మలయాళీ చిత్రంగా ఎంపిక చేశారట.

Also Read'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget