అన్వేషించండి

Preity Mukhundhan: అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?

Hrudayam Murali: జూలై 10న థియేటర్లలోకి వస్తున్న సినిమా 'హృదయం మురళీ'. ఇందులో ప్రీతి ముకుందన్ హీరోయిన్. అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ ఆమె మిస్ చేసుకుందని తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రీతి ముకుందన్ అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ కోల్పోయింది.
  • ‘హృదయం మురళి’ షూటింగ్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది.
  • దర్శకుడు అట్లీ దీనిని ధృవీకరించగా, ఫాతిమా జార్జ్ ఎంపికైంది.

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) గుర్తు ఉన్నారా? విష్ణు మంచు 'కన్నప్ప'లో హీరోయిన్. అయితే... ఆ సినిమాతో ఆమెకు పెద్దగా పాపులారిటీ రాలేదు. కానీ, ఈ ఏడాది 'బ్లాస్ట్' (తెలుగులో 'బ్లాస్ట్ జోన్'గా విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సినిమా)తో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అందులో క్యారెక్టర్, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడీ అమ్మాయి పేరు వార్తల్లో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రీతి ముకుందన్ హాట్ టాపిక్ అయ్యారు. అందుకు కారణం ఏమిటో తెలుసా? అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడం. 

ప్రీతికి అల్లు అర్జున్ 'రాకా'లో ఛాన్స్ మిస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సెన్సేషనల్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా 'రాకా' (Raaka Movie). అందులో నటించే అవకాశం ప్రీతి ముకుందన్ చెంతకు వచ్చింది. అయితే... ఆ అవకాశాన్ని ఆమె చేజార్చుకున్నారు. ఆ విషయం ఇప్పుడు ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే...

Also Read: Why Was Rajesh Sharma Hospitalised - ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?

కోలీవుడ్ యంగ్ హీరో, తెలుగులో 'గద్దలకొండ గణేష్' చేసిన అథర్వా (ఒకప్పటి తమిళ్ హీరో మురళీ తనయుడు) నటించిన తాజా సినిమా 'ఇదయం మురళి'. ఆ సినిమాను తెలుగులో 'హృదయం మురళి'గా డబ్బింగ్ చేశారు. జూలై 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. అందులో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు. తమన్ ఓ పాత్రలో నటించడం వల్ల సినిమాకు తెలుగులోనూ బజ్ ఏర్పడింది. అయితే... ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 'రాకా'లో నటించే అవకాశాన్ని ప్రీతి ముకుందన్ మిస్ చేసుకున్నారు.

Also ReadSwathi Srikanth Nagothi Wedding - దర్శకుడితో స్వాతి రెండో పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

చెన్నైలో జరిగిన 'ఇదయం మురళి' ట్రైలర్ లాంచ్‌లో ''రాకా'లో కీలక పాత్ర కోసం ప్రీతి ముకుందన్‌ను సంప్రదించాను. అయితే, అప్పుడు 'ఇదయం మురళి' షూట్‌లో బిజీగా ఉంది. దాంతో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక మా సినిమాను ఆమె వదులుకోవాల్సి వచ్చింది'' అని అట్లీ వివరించారు. అదీ సంగతి. ప్రీతి ముకుందన్ నటన తనకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమా, అదీ అట్లీ వంటి దర్శకుడితో సినిమా చేసే అవకాశం ప్రతి రోజూ రాదని, ఆ ఛాన్స్ మిస్ అయినందుకు తనకు ఎంతో బాధగా ఉందని ప్రీతి ముకుందన్ తన నిరాశను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం మళ్ళీ తప్పకుండా వస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ 'రాకా'లో ప్రీతి ముకుందన్ మిస్ చేసుకున్న పాత్రను ఫాతిమా జార్జ్ చేస్తున్నారు. 'బ్లాస్ట్ జోన్' విజయం తర్వాత 'హృదయం మురళి'తో ప్రీతి ముకుందన్ మరో విజయం అందుకుంటారో? లేదో? చూడాలి. ఇందులో ఫహాద్ ఫాజిల్, నిహారికా ఎన్ఎమ్ కూడా నటించారు.

Also ReadAnasuya Saree Trend - చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా??

Frequently Asked Questions

ప్రీతి ముకుందన్ ఏ సినిమా అవకాశం కోల్పోయింది?

ఆమె అల్లు అర్జున్ నటించిన 'రాకా' చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. 'ఇదయం మురళి' షూటింగ్‌లో బిజీగా ఉండటం దీనికి కారణం.

అల్లు అర్జున్ 'రాకా' సినిమా అవకాశాన్ని ప్రీతి ముకుందన్ ఎందుకు వదులుకున్నారు?

'ఇదయం మురళి' సినిమా షూటింగ్‌తో కాల్‌షీట్లు కుదరకపోవడం వల్ల ఆమె 'రాకా'లో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.

'రాకా' అవకాశం కోల్పోయినందుకు ప్రీతి ముకుందన్ ఎలా స్పందించారు?

అవకాశం మిస్ అయినందుకు ఆమె ఎంతో బాధగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో నటించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రీతి ముకుందన్ ఇటీవల ఏ సినిమాతో విజయం సాధించారు?

ఆమె ఇటీవల 'బ్లాస్ట్' (తెలుగులో 'బ్లాస్ట్ జోన్') సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget