అన్వేషించండి

Carmeni Selvam: సంగీతంలో కార్పొరేట్ కల్చర్... 'కార్మేని సెల్వం'తో రామానుజన్ ప్రయోగం... అందరికీ డబ్బులు వచ్చేలా!

Music Director Ramanujan: సముద్రఖని, గౌతమ్ మీనన్ నటించిన 'కార్మేని సెల్వం'కు రామానుజన్ సంగీతం అందించారు. సంగీతంలో కార్పొరేట్ కల్చర్, సినిమా మ్యూజిక్ గురించి ఆయన ఏం చెప్పారంటే?

Music Director Ramanujan Interview: విలక్షణ నటుడు సముద్రఖని, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కార్మేని సెల్వం'. ఈ శుక్రవారం (ఏప్రిల్ 3న) తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రానికి రామానుజన్ సంగీత దర్శకుడు. అయితే... 'మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ' అని పేరు వేశారు. అలా ఎందుకు చేశారు? సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఎటువంటి సంగీతం అందించారు? వంటి విషయాల గురించి రామానుజన్ ఏం చెప్పారంటే?  

క్రెడిట్ ఒక్కరికే ఎందుకు... సంస్థకు దక్కాలని!
''సినిమాకు సంగీతం అందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా... సంస్థకు దక్కాలని కోరుకున్నాం. ఆ కారణం చేత 2017లో బెంగళూరులో 'మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ'ని ప్రారంభించా. మొదట కార్పొరేట్ ప్రాజెక్టులు చేస్తూ నా సంగీతాన్ని మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టా. ఆ తర్వాత సౌండ్ డిజైన్, వాయిస్‌ ఓవర్, డబ్బింగ్ సేవలు అందించా. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకూ పెరుగుతోంది. మంచి కథలను ప్రోత్సహించాలంటే నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలి. సంగీత నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం కోసం సంస్థ పేరు వేశా. దీని వల్ల సౌండ్ ఇంజనీర్స్, మ్యుజిషియన్స్, ప్రోగ్రామర్స్ సహా... మ్యూజిక్ చేసిన ప్రతి ఒక్కరికీ రాయల్టీ వస్తుంది. దాంతో మ్యూజిక్ చేయడానికి తక్కువ అమౌంట్ తీసుకుంటారు. సంగీత ప్రపంచంలో కార్పొరేట్ కల్చర్ తీసుకు వస్తున్నాం. ఇదొక  కొత్త ప్రభంజనం అనుకోవచ్చు'' అని రామానుజన్ చెప్పారు.

Also ReadRam Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?

'కార్మేని సెల్వం'లో ఎన్ని పాటలు ఉన్నాయంటే?
రామ్‌ దర్శకత్వం వహించిన 'కురైయొండ్రుమ్ ఇల్లై' చిత్రానికి తాను పని చేశానని, ఇప్పుడు 'కార్మేని సెల్వం'కు సంగీతం అందించే అవకాశం రావడం తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని రామానుజన్ చెప్పారు. సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుతూ... ''ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వాటితో పాటు నేపథ్య సంగీతం, ఓఎస్టీ ట్రాక్స్ కంపోజ్ చేశా. మా మ్యూజిక్ క్లౌడ్ సంస్థలో నలుగురు, ఐదుగురు కలిసి పని చేస్తున్నాం. సంగీతం అనేది సమష్టి కృషి. ఈ సినిమాలోని 'అరెరె...' పాటకు తెలుగులో అద్భుతమైన స్పందన లభిస్తోంది. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. తండ్రీ కుమారుల మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. మేం వైలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాం. దాంతో ఆ పాటలో ఎమోషన్ మరింత బలంగా ప్రేక్షకులకు చేరువైంది'' అని చెప్పారు. 

Photo GalleryRamya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?

ఆర్టిస్టులు, నిర్మాతల గురించి రామానుజన్ మాట్లాడుతూ... ''చివరగా 'కార్మేని సెల్వం' హృదయానికి హత్తుకునే సినిమా. సముద్రఖని గారు, గౌతమ్ మీనన్ గారు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సినిమాలకు సంగీతం అందించడం కష్టం. 'హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి' లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు పని చేయాలని ఉంది'' అని చెప్పారు.

Also ReadDhurandhar 2 BO Day 12: కేజీఎఫ్ 2 రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో 12 రోజుల నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget