IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??

రాజమౌళితో సినిమా తీస్తే నెక్ట్స్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ లు తప్పవా? ఇప్పుడు ఆచార్యకు సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రామ్ చరణ్ చుట్టూ ఇదే వార్త తిరుగుతోంది.  

FOLLOW US: 

రాజమౌళితో సినిమా తీస్తే నెక్ట్స్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ లు తప్పవా? ఇప్పుడు 'ఆచార్య'కు సినిమా కు డిజాస్టర్ టాక్ రావటంతో రామ్ చరణ్ చుట్టూ ఇదే వార్త తిరుగుతోంది. వాస్తవానికి మొదట ఆచార్యలో రామ్ చరణ్ ది జస్ట్ క్యామియో రోల్ అన్నారు. కానీ, RRR విడుదల తర్వాత రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్, కథ డిమాండ్ ను బట్టి సిద్ధ క్యారెక్టర్ ను పెంచి... 'ఆచార్య'లో కీలక పాత్రలా మారేలా చేశారు. సో, RRR గ్రాండ్ విక్టరీ తర్వాత రామ్ చరణ్ కు ఫ్లాప్ పడి... రాజమౌళి సెంటిమెంట్ మరోసారి రుజువైందని చాలా మంది ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

వాస్తవానికి ఈ విషయంపైన ఇంత చర్చ జరగకపోయేది. ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎస్ ఎస్ రాజమౌళిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ తర్వాత ఆయన్ను ఘనంగా సన్మానించిన చిరంజీవి... ఆ తర్వాత రాజమౌళి గురించి మాట్లాడారు. RRR లాంటి గొప్ప సినిమాలో రామ్ చరణ్ ను ఓ భాగం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి అందుకు ప్రతిఫలంగా రాజమౌళి చుట్టూ ఉన్న ఓ మిత్ ను బ్రేక్ చేస్తామంటూ ప్రకటించారు.

ముందు చిరంజీవే ఈ టాపిక్ ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడిన తర్వాత... విడుదలైన 'ఆచార్య' డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి, రామ్ చరణ్ ల మేనియాను దాటుకుని ఈ స్థాయిలో 'ఆచార్య' నెగటివ్ టాక్  తెచ్చుకుంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. నిజంగా రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత హీరోకు ఫ్లాప్ లు ఎందుకు పడుతున్నాయి. ఓసారి క్లియర్ గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

రాజమౌళి లార్జ్ దేన్ ది లైఫ్ క్యారెక్టర్లు:
ఎస్.ఎస్. రాజమౌళి... ఈ పేరు గురించి ఈ పేరు క్రియేట్ చేసే బ్రాండ్ గురించి కొత్త గా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా మోస్ట్ టాలెంటెడ్, క్రియేటెడ్ డైరెక్టర్ గా జక్కన్న సంపాదించుకున్న పేరు అంతా ఇంతా కాదు. కానీ రాజమౌళి తీస్తున్న ఈ మాగ్నం ఓపస్ లు, గ్రాండియర్ లే హీరోల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయా? అంటే కొంత మేర అవుననే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఓ మాస్టర్ స్టోరీ టెల్లర్. తన కథలో ఏ పాత్ర ఎలా నటించాలి? ఏ నటుడి నుంచి ఎంత యాక్టింగ్ రాబట్టుకోవాలి? నటుల బాలలేంటీ బలహీనతలు ఏంటీ? ఇలా ప్రతీ అంశంలోనూ పిన్ పాయింటెడ్ గా ఉంటారు రాజమౌళి. ఓ నటికో, నటుడికో ఉన్న హై పాయింట్ యాక్టింగ్ లెవల్ ను టచ్ చేసే వరకూ జక్కన్న నిద్రపోడు. టేక్ ల మీద టేక్ లు చేయించి వాళ్లను లార్జర్ దేన్ ది లైఫ్ క్యారెక్టర్లుగా మార్చేస్తాడు. 'బాహుబలి'లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతుంటుందో... శివగామిగా రమ్యకృష్ణ, బిజ్జల దేవుడిగా నాజర్, కట్టప్పగా సత్యదేవ్, భల్లాల దేవుడిగా రానా, దేవసేనగా అనుష్క ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతీ క్యారెక్టర్ లోనూ ఆ పాత్రలు పోషించిన నటులు తమ కెరీర్ బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి, ఆ స్థాయిలో నటించిన నటులు తర్వాత సినిమాలకు సాధారణ, అతి మామూలు స్క్రిప్ట్ లు తీసుకుంటే ఏమవుతుంది? పొటెన్షియాలిటీ ఉండి కూడా... తర్వాత సినిమాల్లో సాధారణ క్యారెక్టర్లు ప్లే చేస్తే ప్రేక్షకుడు మళ్లోసారి శాటిస్ ఫై కావటం కష్టం అని చెప్పుకోవచ్చు.

రాజమౌళి ఇచ్చే ఎలివేషన్లు
ఇది ప్రత్యేకంగా హీరోల విషయంలో చెప్పుకోవాలి. జక్కన్న సినిమాల్లో ఉండే ఎమోషనల్ మూమెంట్స్, ఆ సినిమా టిక్ హై ను మరింత స్థాయికి తీసుకెళ్లేలా ఎలివేషన్లు క్రియేట్ చేసుకుంటారు రాజమౌళి. 'మగధీర'లో వంద మంది సైనికులతో యుద్ధం, 'బాహుబలి'లో యుద్ధ సన్నివేశాలు, భల్లాల దేవుడి పట్టాభిషేకం, RRR లో హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఫైట్ లు ఇలా ఏ సినిమా చూసుకున్నా కూడా హీరోలకు రాజమౌళి ఇచ్చే ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. మరి అ లాంటి తర్వాతి సినిమాలో  సాధారణంగా ఓ బోయ్ ఆన్ నెక్ట్ డోర్ అన్నట్లు క్యారెక్టర్లు ఉంటే ఆడియెన్స్ అంత త్వరగా తీసుకోలేరు.

హీరోల స్క్రిప్ట్ సెలెక్షన్స్:
ఒక్కసారి రాజమౌళి సినిమాలో చేసిన తర్వాత, ఆ తర్వాత ఫ్లాప్ అయ్యాయ్ అని చెప్పుకుంటున్న స్క్రిప్ట్ లు చూస్తే అర్థమవుతుంది. 'స్టూడెంట్ నెంబర్ 1' చేసిన తర్వాత ఎన్టీఆర్ 'సుబ్బు' స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. 'సింహాద్రి' తర్వాత 'ఆంధ్రావాలా', 'యమదొంగ' తర్వాత 'కంత్రీ'... ఇలా మూడూ కూడా ఫెయిలైన సబ్జెక్ట్ లే. 'ఆంధ్రావాలా'కు చెప్పుకోవటానికి ఓ లైన్ అన్నా ఉంటుంది. కానీ, 'సుబ్బు', 'కంత్రీ' సినిమాలు అయితే మరీ వీక్ సబ్జెక్ట్ లు. అందుకే బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. రామ్ చరణ్ సంగతి తీసుకున్నా అంతే 'మగధీర' లాంటి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న రామ్ చరణ్... ఆ తర్వాత 'ఆరెంజ్' లాంటి కాన్సెప్ట్ తీసుకున్నాడు. వాస్తవానికి 'ఆరెంజ్' ఓ డిఫరెంట్ ప్రయోగం. కానీ, 'మగధీర' లాంటి భారీ హిట్ పడిన తర్వాత చరణ్ మీద ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలాంటి నటుడి నుంచి 'ఆరెంజ్' లాంటి స్క్రిప్ట్ ను అసలు ఊహించలేదు ఫ్యాన్స్. వాస్తవానికి 'ఆరెంజ్'కు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మ్యూజిక్ కానీ... సాంగ్స్ కానీ... ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కు కానీ ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అప్పుడు మాత్రం నిర్మాత నాగబాబు లైఫ్ నే మార్చేసిన సినిమా అది. ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి కోలుకోవటానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. ఇప్పుడు 'ఆచార్య' కూడా అంతే. 'రంగస్థలం' సినిమా తర్వాత ఆర్సీ లోని నటుడిని ప్రేక్షకులు బాగా దగ్గరగా గమనించటం ప్రారంభించారు. RRR లో రామ్ చరణ్ యాక్టింగ్ తారక్ కు ధీటుగా ఉంటుంది. తారక్ ది ఎక్స్ ప్రెసివ్ ఫేస్... ఎమోషన్స్ ను ముఖంలోనే చూపించగల సామర్థ్యం ఉన్న నటుడు. కానీ చరణ్ కి 'ఆరేంజ్'లో ఫర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ RRR వరకూ పడలేదనే చెప్పాలి. అందుకే RRR లో చెలరేగిపోయాడు. ఆ స్ట్రగుల్ ను, తన కున్న లక్ష్యాన్ని కళ్లతోనే పలికిస్తూ రగులుతున్న అగ్నిపర్వతంలా చరణ్ నటించాడు. ఓ సందర్భంలో తారక్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ కు సినిమాలో రాజమౌళి ఎక్కువు స్కోప్ ఇచ్చారు ఫీల్ అయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు... చరణ్ ఏ రేంజ్ లో చెలరేగిపోయాడో. మరి అంత నిరూపించుకున్న చరణ్... 'ఆచార్య' లాంటి వీక్ కాన్సెప్ట్ ఎందుకు ఒప్పుకున్నారని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. తండ్రీ కొడుకులు కలిసి ఫుల్ ఫెల్జ్డ్ గా యాక్ట్ చేస్తున్నారని ఆనంద పడాలో? ఎక్కడా పట్టులేని కథలో కనిపించారని బాధపడాలో? అర్థం కాక మెగా అభిమానులు తలలు పట్టుకున్నారు.

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కే కిక్కు - ఆ ఎనర్జీ ఏంటి బాసూ? ఇదిగో, 'సర్కారు వారి పాట ' ట్రైలర్ వచ్చేసింది

రాజమౌళి
రాజమౌళి సినిమాలు తీస్తున్నారు అంత స్థాయిలో అంచనాలను సినిమా సినిమాకు పెంచుకుంటున్నారు. నెక్ట్ వచ్చే సినిమాల అంచనాలను ఆయన ఎలా అందుకోగలుగుతున్నారు అది కూడా పాయింటే కదా. రాజమౌళి కాలంతో ప్రయాణం చేసే వ్యక్తే కాదు. కాలానికి ముందుకు ఆలోచించగలుగుతున్నాడు కాబట్టే ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు జెండా ఎగురేస్తున్నారాయన. ప్రయోగాలు చేయటానికి కూడా ఏ మాత్రం వెనుకాడరు ఆయన. 'మగధీర' తర్వాత రామ్ చరణ్ 'ఆరెంజ్' ఎలాంటి ప్రయోగమో? 'మగధీర' తర్వాత రాజమౌళి సునీల్ లాంటి కమెడియన్ కు లీడ్ రోల్ ఇచ్చి చేసిన 'మర్యాదరామన్న' కూడా అలాంటి ప్రయోగమో. మరి 'మర్యాద రామన్న' ఎలా హిట్ అయ్యింది? అసలు లీడ్ రోల్ లో ఏ హీరో లేకుండా నాని లాంటి హీరోకి క్యామియో రోల్ ఇచ్చి 'ఈగ' లాంటి ఓ ప్రాణితో సినిమా తీశాడు కదా రాజమౌళి! మరి, ఆయన ధైర్యమేంటీ? తన ధైర్యం తనే. కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. ఆడియెన్స్ ఎడ్రినలిన్ రష్ పెంచాలి. ఇదే రాజమౌళికి తెలిసింది. హీరో అంటే డైరెక్టర్ చెప్పే కథే కాదు సినిమా ట్రీట్మెంట్ ఏంటీ? ఇప్పుడు జనరేషన్ కి ఎంత రీచ్ అవుతుంది? ఎలాంటి కథలు ఎంచుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ జనాలు ఆదరిస్తారు. మార్కెట్ ఏంటీ...సింగిల్ ఇండివ్యుడుల్ గా వెళ్లే ఎలా ఉంటుది. మల్టీస్టారర్ లో వెళ్లే ఎలా ఉంటుంది. కమర్షియల్ వయబులిటీ ఎంత...ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది.  ఇలా మొత్తం స్టడీ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలు, డైరెక్టర్ లకే కాదు... హీరోలపైనా ఉంటుంది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తారు కాబట్టే ప్రతీ సినిమాకు రాజమౌళి ఓ మెట్టు పైకే ఎక్కుతున్నారు ఎక్కడా తడబడటం లేదు.

Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్

ప్రేక్షకులు
చివరిగా చెప్పుకోవాల్సింది ప్రేక్షకుల గురించే. వాళ్ల పల్స్ ను పట్టడం ఎవరి తరం కాదు. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఎవరికీ తెలియదు. హిట్టు సినిమా ఇలా తీయాలి అనే బుక్ రాసిన డైరెక్టర్ హిట్ సినిమా తీయలేకపోవచ్చు. ఇది చేశారు కాబట్టే ఫెయిలయ్యారు అని చెప్పే నా లాంటి రివ్యూయర్స్ కూడా ఓ సీన్ ను నెరేట్ చేయలేకపోవచ్చు. సినిమా అనేది పూర్తిగా ప్రేక్షుకుడి అభిరుచి. క్లాస్ మాస్ తేడా లేకుండా ఎక్కువ శాతం మంది రీచ్ అవ్వగలిగితే సినిమా హిట్టే. అంతే కానీ రాజమౌళి సినిమాలో చేస్తే ఫ్లాపే..ఫలానా వ్యక్తి తీస్తే అన్నీ హిట్లే లాంటివి కేవలం నమ్మకాలు గానే మిగిలిపోతాయి తప్ప సినిమాలు ఆడించవు. 

Also Read: చిరంజీవి సినిమా నుంచి రవితేజను తీసేశారా? లేదంటే తప్పించారా?

Published at : 03 May 2022 08:33 AM (IST) Tags: ntr ram charan Rajamouli Why Flops For Rajamouli Heros? Rajamouli Heros Future Explained

సంబంధిత కథనాలు

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు

Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Brother For Sister : రియల్ రాఖీ - సోదరి న్యాయం కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ?

Brother For Sister :  రియల్ రాఖీ - సోదరి న్యాయం కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ?