Chiranjeevi - Ravi Teja: చిరంజీవి సినిమా నుంచి రవితేజను తీసేశారా? లేదంటే తప్పించారా?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కలయికలో రూపొందుతున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే... ఆ సినిమాలో రవితేజ చేయడం లేదట!
Acharya Effect On Chiranjeevi - KS Ravindra Film?: మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి మాస్ మహారాజా రవితేజను తీసేశారా? లేదంటే సున్నితంగా తప్పించారా? - ఇప్పుడు తెలుగు సినిమా సర్కిళ్లలో హాట్ హాట్ టాపిక్ ఇది. సిల్వర్ స్క్రీన్ మీద మెగాస్టార్, మాస్ మహారాజా కాంబోను చూసే అవకాశం లేదనేది ఫిల్మ్ నగర్ గుసగుస. అసలు వివరాల్లోకి వెళితే...
చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' (Waltair veerayya) టైటిల్ ఖరారు చేసినట్లు ఇటీవల మెగాస్టార్ లీక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ఉంది. ఆ పాత్రకు రవితేజను సంప్రదించారు. దాదాపుగా పదిహేను కోట్ల పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రావడంతో రవితేజ కూడా ఓకే అన్నారని సమాచారం. అయితే, సినిమాలో రవితేజ నటించడం లేదనేది లేటెస్ట్ టాక్.
'ఆచార్య' రిజల్ట్ చూసిన తర్వాత వాల్తేరు వీరయ్య బడ్జెట్ లెక్కలు మారాయి అనేది ఫిల్మ్ నగర్ వర్గాల గాసిప్స్ సారాంశం. రవితేజకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు ఆ పాత్రకు వేరొక నటుడిని తీసుకుంటే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. మాస్ మహారాజను తప్పించడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ చాలా తగ్గుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
Also Read: పూజా హెగ్డే దగ్గర అంత టైమ్ లేదమ్మా - అక్కడ బాలీవుడ్ ఫిల్మ్ వెయిటింగ్
'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీకే మోహన్ ప్రవీణ్ సహనిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్ లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.
Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.