By: ABP Desam | Updated at : 02 May 2022 07:01 AM (IST)
ధర్మేంద్ర
ధర్మేంద్రకు ఏమైంది? ఆయన ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆదివారం హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ విధమైన ఆందోళన నెలకొంది. సినిమా ప్రముఖులతో పాటు సాధారణ ప్రేక్షకులు, ధర్మేంద్ర అభిమానులు కలత చెందారు. దీనంతటికీ కారణం ఒక్కటే... నాలుగైదు రోజుల క్రితం ధర్మేంద్ర ఆసుపత్రి పాలయ్యారని, ఆయన ఐసీయూలో ఉన్నారనే వార్తలు ఒక్కసారిగా బయటకు రావడమే! అసలు ఏమైంది? ధర్మేంద్ర ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే...
ఏప్రిల్ చివరి వారంలో బ్యాక్ పెయిన్ కారణంగా ధర్మేంద్ర ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'రాఖీ రాణి క ప్రేమ్ కహాని' చిత్రీకరణ చేస్తుండగా బ్యాక్ పెయిన్ రావడంతో ఆస్పత్రికి వెళ్లారట. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజులుగా ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్నారనే వార్త ముంబై మీడియా, ప్రేక్షకుల్లో చక్కర్లు కొట్టింది. దాంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
ధర్మేంద్ర ఆసుపత్రిలో జాయిన్ అయిన మాట వాస్తవమే. అలాగే ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారనే మాట కూడా వాస్తవమే. తన ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరగడంతో... ధర్మేంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు.
Also Read: 'మహేష్ ఫ్యాన్స్ కు ఇదొక ట్రీట్' - 'సర్కారు వారి పాట' సినిమాపై కీర్తి కామెంట్
"ఫ్రెండ్స్... ఏది అతిగా చేయవద్దు. నేను చేశాను. ఇబ్బంది పడ్డాను. బ్యాక్ మజిల్ పెయిన్ వచ్చింది. నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగైదు రోజులు కష్టమయ్యింది. మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలతో ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాను. ఆందోళన చెందవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. లవ్ యు ఆల్'' అని ధర్మేంద్ర పేర్కొన్నారు.
Also Read: 'ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్' - 'భళా తందనాన' ట్రైలర్ చూశారా?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Dharmendra Deol (@aapkadharam)
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
Sarkaru Vaari Paata: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది