అన్వేషించండి

Zainab Ravdjee : అఖిల్ పెళ్లి చేసుకున్న జైనాబ్ రావడ్జీ ఎవరు? ఆమె తండ్రికి జగన్‌తో ఉన్న సంబంధాలేంటీ?

Zainab Ravdjee : నాగచైతన్య పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో అఖిల్ కూడా ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నారని నాగార్జున ప్రకటించారు. అమ్మాయి పేరు జైనాబ్ రావడ్జీ. ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

Who is Zainab Ravdjee: అక్కినేని (Akkineni Nagarjuna) కుటుబంంలో మరోసారి పెళ్లి బాజాలు మోగాయి. రెండో కుమారుడు అఖిల్(Akhil Akkineni) వివాహం జైనాబ్ రావడ్జీ(Zainab Ravdjee)తో అంగరంగ వైభవంగా జరిగింది. గత నవంబర్‌లో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇవాళ( 6 జూన్‌ 2025) పెళ్లి పరిమితంగా వచ్చిన అతిథుల మధ్య చూడముచ్చటగా జరిగింది. అయితే ఇప్పుడు జైనాబ్ రావడ్జీ ఎవరు అనే విషయం గురించి చాలా మంది సెర్ చేస్తున్నారు. జైనాబ్ రావడ్జీ తెలుగువారు కూడా కాదు. కానీ హైదరాబాదీలే. అయితే ఆ కుటుంబానికి రాజకీయ, వ్యాపార లింకులు ఉన్నాయి.  జైనాబ్ రావడ్జీ తండ్రి జుల్ఫీ  రావడ్జీ ఏపీ ప్రభుత్వంలో జగన్ సలహాదారుగా పని చేశారు. కేబినెట్ ర్యాంక్‌తో ఆయన కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. 

జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ZR ఇన్ ఫ్రా పేరుతో  కంపెనీ ఉంది. ఆయనను సీఎంగా ఉన్నప్పుడు జగన్ 2020 మార్చిలో  కేబినెట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ర్యాంక్ గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆ జీవోలో ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసిగా పేర్కొన్నారు. అరబ్ దేశాల్లో మంచి పలుకుబడి ఉన్న కుటుంబంగా భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి గతంలో బాక్సైట్ సమన్లు వచ్చాయి. అన్‌రాక్‌, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్‌ సరఫరా వివాదం అంతర్జాతీయ కోర్టులో ఉంది. ఈ వివాద పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావడ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది.  జుల్ఫీకి సహాయకారిగా ఉండేలా అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు.  

అంటే ఈ జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ఏపీ రాజకీయాలతో పాటు నాగార్జునకు కూడా సన్నిహితులు అని అనుకోవచ్చు. వ్యాపారపరంగా నాగార్జునతోపాటు నిమ్మగడ్డ  ప్రసాద్ మరికొందరు భాగస్వాములని అందులో అఖిల్‌ భార్య కుటుంబం కూడా ఉన్నారని భావిస్తున్నారు. మొదట్లో వ్యాపార సంబంధాలే ఉన్న కుటుంబం ఇప్పుడు అఖిల, జైనాబ్ రావడ్జీ వివాహంతో కుటుంబ బంధంతో బలపడింది.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జుల్ఫీని ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పుడు ఆయనెవరో అందరూ ఆశ్చర్యపోయారు.   

జల్ఫీ రావడ్జీ కుటుంబానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ లోనూ వీరికి వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా అఖిల్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తెలుగు కాకపోవచ్చు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోవచ్చు కానీ తండ్రి వ్యాపారభాగస్వాములు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget