Bollywood: బాలీవుడ్ లో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ ఎవరో తెలుసా? టాప్ 5 లో లేని అనుష్క, కరీనా!
Richest Bollywood Actress: నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.మరోవైపు బ్రాండ్ల ప్రమోషన్ ద్వారా కోట్లు సంపాదించారు. ఈ ఐదుగురిలో ధనవంతురాలైన బాలీవుడ్ నటీమణి ఎవరో తెలుసా...

Bollywood: తమ నటనతో పాటూ అందంలోనూ ఇండస్ట్రీలో తమకంటూ స్పెషల్ పాలోయింగ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీస్ కొందరు. వీరి ప్రత్యేకత ఏంటంటే కేవలం హిందీ చిత్రసీమకే పరిమితం కాలేదు..ఓవైపు సౌత్ లో అడుగుపెట్టారు మరోవైపు హాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షంచుకున్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పెళ్లి చేసుకుని , తల్లైన తర్వాత కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటూ సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్నారు. నెట్‌వర్త్ పరంగా బాలీవుడ్ నటీమణులు పోటాపోటీగా ఉన్నారు. అత్యంత ధనవంతులైన బాలీవుడ్ టాప్ 5 హీరోయిన్స్ ఎవరో చూద్దామా..
అగ్రస్థానంలో జూహీ చావ్లా
జూహీ చావ్లా బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులైన నటీమణులలో ఒకరు. ఆమె నికర విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. హురున్ నివేదిక ప్రకారం, జూహీ చావ్లా నికర విలువ 4600 కోట్లు. జూహీ చావ్లా నటన ప్రపంచానికి దూరంగా ఉన్నారు, కానీ ఆమె తన భర్తకు వ్యాపారంలో సపోర్ట్ చేస్తున్నారు. దీనితో పాటు, ఆమె షారుఖ్ ఖాన్తో కలిసి KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) IPL జట్టును కొనుగోలు చేశారు

ఐశ్వర్య రాయ్ రెండవ స్థానంలో ఉన్నారు
ఐశ్వర్య రాయ్ అందానికి దాసోహం కాని సినీ ప్రియులు ఉండరు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలిన ఐశ్వర్యా రాయ్ పెళ్లి తర్వాత జోరు తగ్గించారు. ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత నటనకు లాంగ గ్యాప్ తీసుకున్నారు. ఆ మధ్య మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీస్ లో మెరిశారు ఐశ్వర్య. సినిమాలపరంగా జోరు తగ్గినా బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు ఐశ్వర్య. చాలా పెట్టుబడులు కూడా పెట్టారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ 900 కోట్లు..

దేశీ గర్ల్ మూడవ స్థానంలో నిలిచింది
ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు - రాజమౌళి SSMB 29 సినిమాలో నటిస్తోంది. ప్రియాంక సినిమాల్లో నటించడంతో పాటు అనేక పెట్టుబడులు పెడుతోంది. ఆమెకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలాగే రెస్టారెంట్ కూడా ప్రారంభించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రియాంకా చోప్రా నికర విలువ 650 కోట్లు.

ఆలియా భట్ నంబర్ 4
ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ప్రస్తుతం మేకర్స్ మొదటి ఛాయిస్ ఆలియా భట్. ఆలియా చాలా చిన్న వయస్సులోనే తన నికర ఆస్తుల విలువను ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. ఆలియా సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు.. ఆమె ఒక దుస్తుల బ్రాండ్‌ను కూడా నడుపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆలియా నికర విలువ 550 కోట్లు.

చివరిది దీపికా పదుకొనే
ఈ లిస్ట్ లో చివర్లో ఉన్నారు దీపికా పదుకొనే. దీపిక అంటే భారతదేశంతో పాటూ విదేశాల్లోనూ దీపికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీపికా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలలో భాగమవుతుంది. దీపికా నటనకు ఫిదా కాని ప్రేక్షకులుండరేమో. టైమ్స్ నివేదిక ప్రకారం, దీపికా నికర విలువ 500 కోట్లు.























