Aamir Khan: ఆమె బ్రేకప్ చెప్పిందని గుండు చేయించుకున్నాడు, రక్తంతో లెటర్ రాశాడు - అమీర్ ఖాన్ నిజంగా ఇలా చేశారంటే నమ్ముతారా?
Aamir Khan: అమీర్ ఖాన్.. ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని చిలిపి విషయాలు పంచుకున్నారు. రక్తంతో లెటర్ రాశానని, బ్రేకప్ అయితే గుండు చేయించుకున్నానని అన్నారు.
Aamir Khan Called Himself ‘Intense Lover’: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. పరిచయం అక్కర్లేని పేరు. కోట్లాది మంది అభిమానులు ఆయనకు. అయితే, అమీర్ ఖాన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. తన లవ్, బ్రేకప్.. తెలియని వయస్సులో చేసి ఆవేశంతో చేసిన పనుల గురించి చెప్పుకొచ్చారు. తాను రీనా(మొదటి భార్య)ను కలవక ముందు నాలుగు సార్లు లవ్‌లో పడ్డానని, బ్రేకప్ అయితే గుండు కొట్టించుకున్నాను అంటూ సీక్రెట్స్ చెప్పుకొచ్చారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షూటింగ్ కోసం కాదు..
“గతంలో ఒకసారి నేను గుండు కొట్టించుకున్నాను. చాలామంది సినిమా కోసం కొట్టించుకున్నాను అనుకున్నారు. కానీ, నిజం ఏంటంటే నేను గుండె కొట్టించుకుంది వేరే విషయం గురించి. అదే నా లవ్ బ్రేకప్. నేను ఒక అమ్మాయి చాలా ఏళ్లు ప్రేమించుకున్నాం. అయితే, ఆమె కొన్ని రోజుల తర్వాత నన్ను ప్రేమించడం లేదని చెప్పింది. దాంతో నా గుండె పగిలిపోయింది. ఆమె కోసం నేను గుండు కొట్టించుకున్నాను. నిజానికి అది చాలా పరిపక్వత లేని , చిన్న పిల్లాడి ప్రవర్తన. అప్పుడే ఒక సినిమా కోసం కేతన్ ని కలిస్తే అతను.. నీ జుట్టు ఎక్కడ? అని అడిగాడు నేను వెంటనే ఆ అమ్మాయితో వెళ్లిపోయింది అని చెప్పాను” అని తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తుచేసుకుని నవ్వుకున్నారు అమీర్ ఖాన్.
నాలుగు సార్లు లవ్ లో పడ్డాను.. రక్తంతో లెటర్ రాశాను..
మీరు ఎవరినైనా తీవ్రంగా ప్రేమిస్తారా? అని అడిగిన ప్రశ్నకి అమీర్ ఖాన్ అవుననే సమాధానం చెప్పారు. “అవును నేను అమర ప్రేమికుడిని. ఆమె నాతో చాలా రోజులు రిలేషన్ లో ఉంది. ఆ తర్వాత వద్దు అనుకుంది. నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇక నా ప్రేమ విషయానికొస్తే నేను రీనా దత్తాను ప్రేమించకముందే నలుగురిని ప్రేమించాను. ఇక రీనాకి అప్పట్లో రక్తంతో లెటర్ రాశాను. దానికి ఆమె చాలా అప్ సెట్ అయ్యింది. అలాంటి పనులు చేశాను ప్రేమ కోసం” అని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.
రెండు పెళ్లిలు..
ఇక అమీర్ ఖాన్ పెళ్లి విషయానికొస్తే ఆయనకు రెండు పెళ్లిలు అయ్యాయి. ఇద్దరి భార్యలతో విడాకులు తీసుకున్నారు అమీర్ ఖాన్. 1986లో రీనా దత్తాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. వాళ్లకి ఇద్దరు పిల్లలు జునాయిద్, ఐరా. అయితే, కొన్ని కారణాల వల్ల 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావ్ తో ప్రేమలో పడిన అమీర్ ఖాన్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్లిద్దరు కూడా 2021లో విడాకులు తీసుకున్నారు.
సినిమాల విషయానికొస్తే అమీర్ ఖాన్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాదోంకి భారత్‌లో ఆయన నటించారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బీజీ అయిపోయాడు. ఆ తర్వాత జూహీ చావ్లాతో కలిసి 1988లో మొదటిసారి హీరోగా సినిమా చేశాడు. ఇక అక్కడ నుంచి తన కెరీర్‌లో ఎన్నో హిట్లు కొట్టాడు అమీర్ ఖాన్.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్ - త్వరలో వెబ్ సీరిస్‌తో రి-ఎంట్రీ