Celebrity Cricket Carnival: గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్ - త్వరలో వెబ్ సీరిస్‌తో రి-ఎంట్రీ
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ కి సినీ, క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ ఉంది. తమ అభిమాన హీరో క్రికెట్ ఆడి, రన్స్ చేస్తున్నాడు అంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇప్పుడు సీజన్ - 2 స్టార్ట్ కాబోతుంది.
Actor Tharun About Celebrity Cricket Carnival: ఈ ఏడాది నవంబర్‌లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ - 2 జరగబోతుంది. 2024లో క్రికెట్ కార్నివల్ జరగడం ఇది రెండోసారి. ఇప్పటికే ఫిబ్రవరీలో ఒకసారి మన సెలబ్రిటీలు మ్యాచ్ ఆడారు. ఇక ఇప్పుడు మరోసారి గ్రౌండ్‌లో తమ సత్తా చూపించబోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేదు మన సెలబ్రిటీల టీమ్‌కు. దీంతో ఈసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాడు కెప్టెన్, హీరో తరుణ్. దానికి సంబంధించి వివరాలను పంచుకున్నారు. హీరో, హీరోయిన్ల మధ్య మ్యాచ్ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకి ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే తాను త్వరలో ఒక సినిమా, వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
పిల్లల కోసం ఆడటం హ్యాపీ..
ఏడాదిలోనే రెండు సార్లు క్రికెట్ ఆడటం చాలా హ్యాపీగా ఉందని అన్నారు తరుణ్. అదీ కూడా ఒక మంచి విషయం కోసం ఆడుతున్నామని అన్నారు. ఇలా ఆడటం చాలా హ్యాపీగా ఉంది. ఆడిన కంట్రీలోనే రెండు సార్లు ఆడటం అంటే బాగా అనిపిస్తుంది. అది కూడా యూఎస్‌లో. ఇదే ఏడాదిలో రెండుసార్లు ఆడుతున్నాం. ఫిబ్రవరీలో ఆడాం. ఇప్పుడు మళ్లీ నవంబర్ లో ఆడతారా? అని అడిగారు. ఓకే అన్నాము. స్పాన్సర్స్ అందరూ రెడీగా ఉన్నారు. క్రౌడ్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పోయినసారి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల కోసం ఆడాం. ఇప్పుడు వాళ్లే అడిగారు వాళ్ల కోసమే ఆడాలి అన్నారు. ఒక మంచి ఉద్దేశం కోసం కాబట్టి ఆడతాం అని చెప్పాం. పిల్లల కోసం ఆడటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు తరుణ్.
మా టీమ్ మాకు బలం..
మా టీమ్‌లో అందరూ 11 మంది. క్యాప్టెన్ నేను అయినప్పటీకీ అందరం అన్నీ చూసుకుంటాం. తమన్ వచ్చి ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. శ్రీకాంత్ గారు బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటారు. నేను బౌలింగ్ చూసుకుంటాను. ఇదంతా టీమ్ ఎఫర్ట్స్. ఓ పెద్ద ప్లానింగ్ తో, స్ట్రాటజీతో ఏమీ వెళ్లం. ఎందుకంటే అవతలి టీమ్ ఎవరు అనేది కూడా మాకు ముందే తెలీదు. మా టీమ్ బలం ఏంటో మాకు తెలుసు. అదే మా స్ట్రాటజీ అంతేకానీ ముందు నుంచే ఏమీ అనుకోము. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఆడినవన్నీ గెలిచాం. సౌత్ ఆఫ్రికా, యూఎస్, దుబాయ్, విజయవాడ, వైజాగ్ ఆడిన ప్రతి గేమ్ గెలిచాం కాబట్టి రిగ్రట్స్ ఏమీలేవు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ దాదాపు ఓడిపోయేవాళ్లం. కానీ, గెలిచేశాం. మా అదృష్టం అది అని తన టీమ్ గురించి చెప్పారు.
ఫిట్ నెస్ గురించి..
యాక్టర్స్ అంటేనే ఫిట్ గా ఉండాలి. అందరం ఫిట్ గానే ఉన్నాం. క్రికెట్ ఆడుతూ ఉంటాం. ప్రాక్టీస్ చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడూ ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాలేదు. హీరోయిన్లు అంతా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. సపోర్ట్ ఇస్తారు. ఇక మాకు వాళ్లకి మధ్య మ్యాచ్ అంటే.. వాళ్లు ఆడాలి అంటే.. అదంతా ఆర్గనైజర్స్ చూసుకుంటారు మనకు తెలీదు. అని చెప్పారు తరుణ్.
త్వరలోనే రెండు సినిమాలు..
తరుణ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. అయితే, ఇప్పుడు ఆయన మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. త్వరలోనే రెండు ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకటి ఫీచర్ ఫిలిమ్ కాగా.. మరోకటి వెబ్ సీరిసీ అని తరుణ్ తెలిపారు.
Also Read: ఈ వారం థియేటర్ - ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!