అన్వేషించండి

Mirai: ‘మిరాయ్’ అంటే ఏంటి? తేజ సజ్జా అప్‌కమింగ్ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?

Mirai Movie: ‘హనుమాన్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా అప్‌కమింగ్ మూవీ గ్లింప్స్ విడుదలయ్యింది. ఇక ఈ సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Teja Sajja Upcoming Movie Titled As Mirai: కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కడం మాత్రమే కాదు.. కొత్త కొత్త పదాలతో టైటిల్‌ను ఫిక్స్ చేసి అసలు వాటి అర్థం ఏంటని ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం తేజ సజ్జా సినిమాకు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగించారు. ‘హనుమాన్’తో ఓ రేంజ్‌లో ఫేమ్ దక్కించుకున్నాడు తేజ సజ్జా. ఇక తన తరువాతి మూవీని కూడా అంతే భారీ స్కేల్‌లో ప్లాన్ చేశాడు. అదే ‘మిరాయ్’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలయ్యింది. అయితే ‘మిరాయ్’ అనే టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని, అసలు దాని అర్థం ఏంటి అని ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

అదే టైటిల్ ఎందుకు?

‘మిరాయ్’ అనేది ఒక జపాన్ పదం. మామూలుగా దీనికి భవిష్యత్తు అనే అర్థం వస్తుంది. కానీ ఇతర భాషల్లో ఈ పదానికి వేర్వేరు అర్థాలు కూడా ఉన్నాయి. అద్భుతాన్ని కూడా మిరాయ్ అనే అంటారు. అయితే తేజ సజ్జా హీరోగా ఇప్పటికే ‘అద్భుతం’ అనే టైటిల్‌తో ఒక సినిమా చేశాడు. ఆ మూవీ క్లీన్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు దాదాపుగా అదే అర్థం ఇచ్చే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే తన సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడం వెనుక ఇంకా ఏదో కారణం ఉండవచ్చని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. పైగా ‘మిరాయ్’ అనే టైటిల్‌కు సంబంధం లేకుండా ‘సూపర్ యోధ’ అనే ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

భవిష్యత్తు కోసం పోరాటం..

‘మిరాయ్’ గ్లింప్స్‌ను బట్టి చూస్తే సామ్రాట్ అశోక కాలం నుంచి అతి ముఖ్యమైన 9 గ్రంథాలు ఉన్నాయని, వాటిని తరతరాలుగా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారని, వాటిని దక్కించుకోవడానికి ఒక విలన్ వచ్చాడని చూపించారు. అయితే ఆ విలన్ ఎవరు అనేది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. కానీ ఆ గ్రంథాలు ఆ విలన్ చేతికి దక్కకుండా కాపాడడానికి యోధుడిగా తేజ సజ్జా రంగంలోకి దిగుతాడు. ఒకవేళ 9 గ్రంథాలకు రక్షణ కల్పించి, ప్రపంచాన్ని ప్రమాదం నుంచి కాపాడతాడు కాబట్టి.. భవిష్యత్తు ప్రశాంతంగా మారుస్తాడు కాబట్టి ఈ సినిమాకు ‘మిరాయ్’ (భవిష్యత్తు) అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏడు భాషల్లో..

ఒక తెలుగు సినిమాకు జపాన్ పదాన్ని టైటిల్‌గా పెట్టడం ఎందుకు అనేది ‘మిరాయ్’ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. పైగా గ్లింప్స్‌లో లొకేషన్స్ చూస్తుంటే కూడా ఇది జపాన్‌లో షూటింగ్ జరుపుకున్నట్టుగానే అనిపిస్తోంది. లేదా ఆ లొకేషన్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేసి ఉండవచ్చు. ఇక కార్తిక్ ఘట్టమనేని, తేజ సజ్జా లాంటి ఇద్దరు యంగ్ టాలెంట్ కలిస్తే మూవీ ఏ రేంజ్‌లో ఉంటుంది అని ‘మిరాయ్’ గ్లింప్స్‌లోనే చూపించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 13న విడుదల అవుతుందని ఇప్పుడే ప్రకటించారు మేకర్స్. అంతే కాకుండా ఇండియన్, విదేశీ భాషలతో కలిపి మొత్తం 7 భాషల్లో ‘మిరాయ్’ విడుదల కానుంది.

Also Read: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget