అన్వేషించండి

Mega-Allu Family: చిరంజీవి, అల్లు అరవింద్ ఎలా కలుసుకున్నారు? - ఇది కుటుంబాల మధ్య మనస్పర్థలా? ఫ్యాన్ వారా?

Chiranjeevi: ఏపీ ఎన్నికల తర్వాత మెగా-అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మెగా సెలబ్రేషన్స్‌లో ఎక్కడ కూడ అల్లు ఫ్యామిలీ కనిపించడం లేదు. అసలు మెగా-అల్లు ఫ్యామిలో ఏం జరుతుంది..

What Happens in Chiranjeevi and Allu Arvind Family: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల హడావుడి ముగిసింది. ఫలితాల్లో జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి అధికారం అయితే ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓ సంఘటన మాత్రం ఇప్పటికి హాట్‌టాపిక్‌గానే నిలిచింది. అదే హీరో అల్లు అర్జున్‌ ఎన్నికల ప్రచారం. తన సొంత బంధువు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కు కాకుండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారం చేశాడు. అదే ఇప్పుడు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు కారణమైందనేది అందరి అభిప్రాయం. ఇది బయటకు చెప్పకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాదని అనలేకపోతున్నారు.

ఎవరూ ఎవరికి బ్రేక్ ఇచ్చారు..

పవన్ గ్రాండ్‌ విక్టరిని మెగా ఫ్యామిలీ మొత్తం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది. ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ అసలు కనిపించలేదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. దీనిపై తరచూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతేకాదు మెగా-అల్లు ఫ్యాన్స్‌ మధ్య కూడా వార్‌ నడుస్తుంది. ఈ విషయంలో మా హీరో ఎందుకు తగ్గాలి అంటే మా హీరో ఎందుకు తగ్గాలి అంటూ వాదించుకుంటున్నారు. దీంతో ఎవరూ ఎవరికి బ్రేక్‌ ఇచ్చారంటూ నెట్టింట ఫ్యాన్‌ వార్‌ మొదలైంది. చిరంజీవి వల్లే అల్లు అర్జున్‌కి బ్రేక్‌ వచ్చిందని.. అల్లు రామలింగయ్య గారి అల్లుడు అనే ట్యాగ్‌ లేకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగే అవకాశం ఉండేదని కాదని ఫ్యాన్స్‌ మధ్య రచ్చ నడుస్తుంది.

Mega-Allu Family: చిరంజీవి, అల్లు అరవింద్ ఎలా కలుసుకున్నారు? - ఇది కుటుంబాల మధ్య మనస్పర్థలా? ఫ్యాన్ వారా?

చిరంజీవి మెగా కాంపౌండ్ నుంచే వీరంత వచ్చేరనేది ముందు నుంచి వినిపిస్తున్న అభిప్రాయాలు. ఇండస్ట్రీతో పాటు బయటి వారు చెప్పేది కూడా. ఎంతో నటీనటులు, దర్శకులు చిరంజీవి వేసిన మెగా పునాది నుంచే పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరణ్‌ తేజ్, సాయి ధరమ్‌ ఇలా మెగా హీరోలంతా వచ్చారంటూ.. అంతేకాదు నిర్మాతగా అల్లు అరవింద్‌ సక్సెస్‌ కూడా చిరు వల్లే వచ్చిందనేది మెగా ఫ్యాన్స అభిప్రాయం. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే స్వయంగా చెప్పారు. చిరంజీవికి పద్మ విభూషణ్‌ అనంతరం జరిగిన సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ అసలు ఎవరికి ఎవరూ బ్రేక్‌ ఇచ్చారో చెప్పారు.

చిరంజీవే వారందకి బాట వేశారు - అల్లు అరవింద్

తమ కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు బాట వేసింది చిరంజీవి గారే అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నుంచి అల్లు శిరీష్‌ వరకు అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ హీరోలు అయ్యారని, ఆయన వల్లే ఇండస్ట్రీలో వారు కెరీర్‌ నిర్మించుకున్నారని చెప్పారు. మెగా అంటూ ఇండస్ట్రీలో అంత పెద్ద రహదారిని ఆయన వేశారంటూ అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చారు. అల్లు ఫ్యామిలీ హీరోలకు కూడా బ్రేక్‌ వచ్చింది చిరు వల్లేనని స్వయంగా అల్లు అరవింద్‌ గారే చెప్పారంటూ అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్‌. అలాగే చిరంజీవి గారిని ఫస్ట్‌ టైం చలసాని గోపి ఆఫీసులో చూశానని, అక్కడే చిరంజీవిని గారిన చూశానని చెప్పారు.


Mega-Allu Family: చిరంజీవి, అల్లు అరవింద్ ఎలా కలుసుకున్నారు? - ఇది కుటుంబాల మధ్య మనస్పర్థలా? ఫ్యాన్ వారా?

అక్కడే ఫస్ట్ పరిచయం..

అప్పుడే మా మధ్య చిన్నగా పరిచయం అయ్యింది, ఇద్దరం షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నాం.. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయారు. ఈ షేక్‌ హ్యాండ్‌ ఇన్ని సంవత్సరాలు చేయి పట్టుకని నడుస్తామనుకోలేదన్నారు. ఇలా అల్లు అరవింద్‌ ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్‌ తన సొంత టాలెంట్‌తో ఎదిగారని, గంగోత్రి నుంచి స్వయంగా కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. డైరెక్టర్‌ రాజమౌళితో సినిమా చేయకుండానే పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యరంటున్నారు. కేవలం తన నటన, స్కిల్స్‌తోనే ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎదిగిన బన్నీ.. తెలుగు ఇండస్ట్రీలో ఏ నటుడు దక్కని 'నేషనల్‌ అవార్డు' ఆయనకు దక్కిందంటున్నారు. అంతటి ఘనత ఒక్క తన  స్వయం క్రషితోనే బన్నీ సాధించుకున్నారంటున్నారు. ఇలా ఎవరూ ఎవరికి బ్రేక్‌ ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌ మధ్య చర్చ నడుస్తుంది.

చిరంజీవి ఇలా..

ఇదిలా ఉంటే ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఓ మూవీ షూటింగ్‌ టైం అల్లు అరవింద్‌ గారు తనని బాగా అబ్జెర్వు చేస్తుంటే ఏదో తన నటన నచ్చి చూస్తున్నారనుకున్నా.. కానీ నా మీద మరో నిఘా పెట్టారనుకోలేదన్నారు. అందరు కలిసి ప్లాన్‌ చేసి నన్ను పట్టేశారంటూ సరదాగా చెప్పారు. ఈ విషయంలో రామలింగయ్య గారు సంధిగ్ధంలో ఉంటే.. అరవింద్‌ గారైతే.. ఇచ్చేద్దాం.. మనిషి కనబడతున్నాడు.. ఫ్యూచర్‌ కనిపిస్తుంది.. ఆయనతో ట్రావెల్‌ చేస్తే నా ఫ్యూచర్‌ కనిపిస్తుంది. అప్పుడే అన్నీ ఆయన విజన్‌ చేసుకున్నారు. ఆయనంతా విజనరి ఎవరూ లేరని అదరికి తెలిసిందే కదా.

Mega-Allu Family: చిరంజీవి, అల్లు అరవింద్ ఎలా కలుసుకున్నారు? - ఇది కుటుంబాల మధ్య మనస్పర్థలా? ఫ్యాన్ వారా?

అలాగే నన్ను కూడా కనిపెట్టారంటూ చిరంజీవి చెప్పగా.. ఆయన కామెంట్స్‌ అల్లు అరవింద్‌ కూడా పడిపడి నవ్వారు. ఇక ఇవన్ని గుర్తు చేసుకుంటూ మెగా-అల్లు ఫ్యామిలీలో ఏ హీరోకి అయినా బ్రేక్‌ ఇచ్చింది.. ఇండస్ట్రీలో దారి వేసింది చిరంజీవి గారే అని మెగా ఫ్యాన్స్ నుంచి‌ గట్టి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైన ఏపీ ఎన్నికల వల్ల మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు రావడం ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతారు. ఈ రెండు కుటుంబాలు కలిసి మళ్లీ సరదాగా ఎప్పుడు ఉంటారా? ఇండస్ట్రీ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. మరీ జూన్‌ 20 మెగా వారసురాలు క్లింకార పుట్టిన రోజు వేడుకలో అయినా అల్లు ఫ్యామిలీ సభ్యులు కనిపిస్తారో లేదో చూడాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget