Actress Sri Lakshmi: రమాప్రభ పిచ్చి పట్టినట్టు వీధుల్లో తిరుగుతూ ఆ పని చేసేది - సీనియర్ నటి శ్రీ లక్ష్మి
సీనియర్ నటి శ్రీలక్ష్మి నటి రమాప్రభ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒకానొక సమయంలో తీవ్ర డిప్రెషన్ కు గురైన ఆమె వీధుల్లో పిచ్చి పట్టిన దానిలా తిరిగేదని చెప్పింది.
Actress Sri Lakshmi About Rama Prabha: సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో చక్కటి కామెడీ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకుంది. బాబూ చిట్టీ.. అంటూ మర్చిపోలేని ఎక్స్ ప్రెషన్స్ పెట్టినా, బంగాళా దుంప బౌ బౌ అనే కూర వండినా.. ప్రేక్షకులు పడీ పడీ నవ్వే వాళ్లు. వందల సినిమాల్లో నటించిన ఆమె, నెమ్మదిగా సినిమా పరిశ్రమకు దూరం అయ్యింది. ప్రస్తుతం అన్ని విషయాలను పక్కన పెట్టి దైవ భక్తిలో మునిగిపోయింది. షిరిడి సాయి బాబా సేవలో తరిస్తోంది. ప్రస్తుతం బాబాయే తన సర్వస్వం అంటోంది. ఇంతకీ ఆమె బాబా భక్తురాలిగా మారేందుకు కారణం ఏంటో చెప్తూ, మరో సీనియర్ నటి రమా ప్రభ గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించింది. ఆమె ప్రవర్తన చూసి మెంటల్ వచ్చిందని భావించినట్లు చెప్పింది.
బాబా భక్తురాలిగా ఎందుకు మారానంటే?- శ్రీలక్ష్మి
మొదట్లో తాను రాఘవేంద్ర స్వామిని కొలిచేదాన్ని అని చెప్పిన శ్రీ లక్ష్మీ.. కొన్ని కారణాలతో బాబా భక్తురాలిగా మారినట్లు చెప్పింది. “నేను రాఘవేంద్ర స్వామిని కొలిచేదానిని. ఆయన పూజ విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి. నేను సినిమా ఫీల్డ్ లో ఉన్న కాబట్టి కుదిరేది కాదు. ఎలా అని ఆలోచించాను. ఆయన రూపమే సాయి బాబా అని తెలిసింది. అప్పటి నుంచి బాబాను కొలవడం మొదలు పెట్టాను. నీ నియమాలు పాటించలేక బాబాను కొలుస్తున్నాను క్షమించు నాయనా అని రాఘవేంద్ర స్వామి వేడుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
రమా ప్రభకు పిచ్చి పట్టిందా? అనుకున్నాను- శ్రీలక్ష్మి
అటు, రమాప్రభ వల్ల పూర్తి స్థాయిలో బాబా భక్తురాలిగా మారిపోయినట్లు శ్రీలక్ష్మీ వెల్లడించింది. “శరత్ బాబుతో విడిపోయాక రమప్రభ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. నేను ఆ సమయంలో తనకు దగ్గరగా ఉన్నాను. ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమా 100 రోజుల వేడుక సమయంలో ఆమె పూర్తి డిప్రెషన్ లో ఉంది. నిద్ర మాత్రలు వేసుకుందో ఏమో తెలియదు.. కానీ, మత్తుగా ఆ వేడుకకు వచ్చింది. ఏం చేస్తుందో తెలియట్లేదు. ఈమెకు మెంటల్ వచ్చిందా ఏంటి? అనిపించింది. ఒక ఇంటి దగ్గర చిన్న డప్పు వాయిస్తూ బాబా గురించి పాట పాడుతూ ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా బాబా జపం మానడం లేదు. బాబా స్మృతులు, బాబా పాటలు వీటితోనే తను గడిపేస్తుంది. బాబా లేడంటే రమ ప్రభ లేదు. నేను కచ్చితంగా ఈ విషయాన్ని నమ్ముతాను. ఆమెను చూసి నేను కూడా బాబాను తలుచుకోవడం మొదలు పెట్టాను. ఆయన అందరి పట్ల ఉంటాడు అని భావించాను. అందుకే ఆయన మీదే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాను. నేను ఏ పని చేసినా బాబాను నమ్ముకునే చేస్తాను. ఆయన అనుగ్రహంతోనే అడుగు బయటకు వేస్తాను. ఆయన లేకుండా నేను లేను అని నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చింది.
Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?